IRCTC Recruitment 2022: రాత పరీక్షలేకుండా.. రైల్వే విభాగంలోని ఐఆర్‌సీటీసీలో ఉద్యోగాలు..పదో తరగతి అర్హత..

|

Aug 24, 2022 | 7:24 AM

భారత రైల్వే సౌత్ జోన్‌లో పనిచేయుటకు ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC).. 9 కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

IRCTC Recruitment 2022: రాత పరీక్షలేకుండా.. రైల్వే విభాగంలోని ఐఆర్‌సీటీసీలో ఉద్యోగాలు..పదో తరగతి అర్హత..
Irctc
Follow us on

IRCTC Computer Operator Recruitment 2022: భారత రైల్వే సౌత్ జోన్‌లో పనిచేయుటకు ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC).. 9 కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సీవోపీఏ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు ఖచ్చితంగా 16 నుంచి 25 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 30, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. అర్హత సాధించినవారు తమిళనాడు జోన్‌లో పనిచేయవల్సి ఉంటుంది. ఏడాది పాటు ట్రైనింగ్‌ ఉంటుంది. ట్రైనింగ్‌ సమయంలో నెలకు రూ.5,000ల నుంచి రూ.9,000ల వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.