ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లోని వివిధ డివిజన్‌లలో 465 టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటిస్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ రెండు రోజుల్లో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు నవంబర్ 30, 2022వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంటర్మీడియట్, మెకానికల్, ఎలక్ట్రికల్, టీ అండ్ ఐ, హ్యూమన్ రీసోర్స్, అకౌంట్స్/ఫైనాన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగాల్లో స్పెషలైజేషన్‌లో ఐటీఐ, గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా నవంబర్ 10, 2022వ తేదీ నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. డిసెంబర్ 18న రాత పరీక్ష ఉంటుంది. దీనికి సంబంధించి అడ్మిట్ కార్డులు డిసెంబర్ 8 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎంపికైన వారు పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం, ఉత్తర ప్రదేశ్, హర్యాణా, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఒడిస్సా, చత్తీస్‌ఘడ్, తమిళనాడు, కర్నాటక, గుజరాత్‌లలో పనిచేయవల్సి ఉంటుంది. నిబంధనల మేరకు స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.