IOCL Recruitment: ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. చివ‌రి తేదీ ఎప్పుడంటే..

|

Jan 18, 2022 | 2:36 PM

IOCL Recruitment: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అప్రెంటిస్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయనున్నారు. ఏయో విభాగాంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

IOCL Recruitment: ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. చివ‌రి తేదీ ఎప్పుడంటే..
Follow us on

IOCL Recruitment: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అప్రెంటిస్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయనున్నారు. ఏయో విభాగాంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హత‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 570 టెక్నిక‌ల్‌, నాన్ టెక్నిక‌ల్ అప్రెంటిస్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో మహారాష్ట్ర (322), గుజరాత్ (121), మధ్యప్రదేశ్ (80), చ‌త్తీస్‌గఢ్ (35), గోవా (8), దాద్రా నగర్ హవేలీ (4) యూనిట్ల‌లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్, మెషినిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, రీటైల్ అసోసియేట్ లాంటి సబ్జెక్ట్స్‌లో డిప్లొమా, డిగ్రీ, ఐటీఐ పాసై ఉండాలి. టెక్నిక‌ల్ పోస్టుల‌కు బీటెక్‌/ బీఈ, బీటెక్, ఎంబీఏ, సీఏ, ఎల్ఎల్‌బీ, ఎంసీఏ చేసి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 2022 జనవరి 31 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థుల‌ను రాత ప‌రీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ఫిబ్ర‌వ‌రి 15తో ముగియ‌నుంది.

* పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడండి..

Also Read: Viral News: స్పైడర్‌మాన్‌ పుస్తకంలోని ఓ పేజీ.. ఎంతకు అమ్ముడైందో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!

NTR Vardhanthi: మహానేత ఎన్టీఆర్‌కు ఘన నివాళి.. లైవ్ వీడియో

Encounter: ములుగు అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల మృతి..