IOCL Apprentice Recruitment 2022: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 1535 అప్రెంటిస్‌ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? మరో రెండు రోజుల్లోనే..

|

Oct 21, 2022 | 8:52 AM

భారత ప్రభుత్వ పెట్రోలియం, నేచురల్ గ్యాస్‌ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 1535 ట్రేడ్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మరో రెండు రోజుల్లో..

IOCL Apprentice Recruitment 2022: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 1535 అప్రెంటిస్‌ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? మరో రెండు రోజుల్లోనే..
IOCL Apprentice Recruitment 2022
Follow us on

భారత ప్రభుత్వ పెట్రోలియం, నేచురల్ గ్యాస్‌ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 1535 ట్రేడ్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగుస్తుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు అక్టోబర్‌ 23, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫిజిక్స్‌, మ్యాథమెటిక్స్‌, కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ, ఫిట్టర్, కెమికల్, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌, అకౌంట్స్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీలు ఉన్నాయి. సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఏ/బీఎస్సీ/బీకాం/ఇంటర్మీడియట్‌/ఐటీఐ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే అభ్యర్ధుల వయసు సెప్టెంబర్‌ 30, 2022వ తేదీ నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు అడ్మిట్‌ కార్డులు నవంబర్‌ 1 నుంచి 5 వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష నవంబర్‌ 6వ తేదీన నిర్వహిస్తారు. నవంబర్‌ 21న తుది ఫలితాలు విడుదలవుతాయి. నవంబర్‌ 28 నుంచి డిసెంబర్‌ 7 వరకు డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌ జరుగుతుంది. అర్హత సాధించిన వారికి ప్రతి నెలా స్టైపెండ్‌ కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల వివరాలు..

  • అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్) ఖాళీలు: 396
  • ఫిట్టర్ ఖాళీలు: 161
  • బాయిలర్ ఖాళీలు: 54
  • సెక్రటేరియల్ అసిస్టెంట్ ఖాళీలు: 39
  • అకౌంటెంట్ ఖాళీలు: 45
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీలు: 73

టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల వివరాలు..

  • కెమిస్ట్రీ ఖాళీలు: 332
  • మెకానికల్ ఖాళీలు: 163
  • ఎలక్ట్రికల్ ఖాళీలు: 198
  • ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఖాళీలు: 74

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.