Intelligence Bureau Jobs 2025: డిగ్రీ అర్హతతో ఇంటలిజెన్స్‌ బ్యూరోలో భారీగా ఉద్యోగాలు.. నెలకు లక్షన్నర జీతం

Intelligence Bureau ACIO Recruitment 2025: హోం మంత్రిత్వశాఖకు చెందిన ఇంటలిజెన్స్ బ్యూరో.. అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటలిజెన్స్‌ ఆఫీసర్‌ (ACIO) గ్రేడ్‌ 2 టెక్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 258 అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటలిజెన్స్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ..

Intelligence Bureau Jobs 2025: డిగ్రీ అర్హతతో ఇంటలిజెన్స్‌ బ్యూరోలో భారీగా ఉద్యోగాలు.. నెలకు లక్షన్నర జీతం
Intelligence Bureau ACIO Jobs

Updated on: Oct 26, 2025 | 6:11 PM

కేంద్ర హోం మంత్రిత్వశాఖకు చెందిన ఇంటలిజెన్స్ బ్యూరో.. అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటలిజెన్స్‌ ఆఫీసర్‌ (ACIO) గ్రేడ్‌ 2 టెక్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 258 అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటలిజెన్స్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషనల్‌ టెక్నాలజీ పోస్టులు 90, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ పోస్టులు 168 వరకు ఉన్నాయి. అన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా నవంబర్‌ 11 , 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌, పీజీ ఉత్తీర్ణతతో పాటు 2023, 2024, 2025 గేట్ పరీక్షలో కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్‌లో అర్హత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి సెప్టెంబర్ 28, 2025 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 16, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

గేట్‌ స్కోర్‌, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, గేట్ స్కోర్‌ల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఖాళీల సంఖ్యకు 10 రెట్లు చొప్పున దరఖాస్తులు వస్తే నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ, నైపుణ్య పరీక్ష ఢిల్లీలో జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు జీతంగా చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు కింద యూఆర్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు రూ.200, మహిళలు ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్ధులకు రూ.100 చొప్పున రిజిస్ట్రేషన్ఫీజు చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

ఎంపిక విధానం ఇలా..

మొత్తం మార్కింగ్ విధానం 1175 మార్కులకు ఉంటుంది. ఇందులో గేట్ స్కోర్‌కు 750 మార్కులు కేటాయిస్తారు, స్కిల్ టెస్ట్‌కు 250 మార్కులు, ఇంటర్వ్యూకు 175 మార్కులు ఉంటాయి.

ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO నోటిఫికేషన్ 2025 కోసం ఇక్కడ క్లిక్చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.