కరోనా విజృంభణ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) కు పలు సంస్థలు మొగ్గు చూపాయి. తమ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసుకునేలా వెసులుబాటు కల్పించాయి. అయితే కరోనా వ్యాప్తి తగ్గడం, టీకాలు వేయించుకోవడం వంటి కారణాలతో వర్క్ ఫ్రమ్ హోమ్ కు కంపెనీలు స్వస్తి చెబుతున్నాయి. ఉద్యోగులు ఆఫీస్ కు వచ్చి పని చేయాలని సూచిస్తున్నాయి. అయితే ఇన్నాళ్లు వర్క్ ఫ్రమ్ హోమ్ కు అలవాటు పడ్డ ఉద్యోగులు.. ఆఫీస్(Office) కు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా ఇంటి నుంచే పని చేసే విధానాన్ని రెగ్యులర్ చేయాలని కంపెనీ హెచ్ఆర్ ను సంప్రదిస్తున్నారు. దీని కోసం తమకు రావాల్సిన ప్రమోషన్లనూ కొందరు వదులుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇన్ఫోసిస్ (Infosys) వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murty) మాత్రం భారతీయులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సూట్ అవదని అంటున్నారు. ఇటీవల అన్ని సంస్థలు వర్క్ ఫ్రమ్ చేస్తున్న ఉద్యోగుల్ని ఆఫీస్‌కు పిలిపించాయి. మరి కొన్ని కంపెనీలు ఐబ్రిడ్ వర్క్ మోడ్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఈ పరిస్థితులపై ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇవంతి.. సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 71శాతం మంది ఉద్యోగులు తమకు ఆఫీస్ లో పనిచేయడం కంటే ఇంటి వద్ద నుంచి పనిచేయడాన్ని ఇష్టపడుతున్నట్లు తేలింది.
గూగుల్ ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసులకు వస్తామని మెయిల్స్ చేస్తున్నారు. 42శాతం మంది ఉద్యోగులు హైబ్రిడ్ వర్క్‌తో సంతోషంగా ఉన్నారు. 30శాతం మంది శాశ్వతంగా ఇంటి నుంచి పని చేయాలని అనుకుంటున్నారు. 13 శాతం మంది మాత్రమే ఆఫీస్ కు రావాలనుకుంటున్నారు. కరోనా విజృంభణ దృష్ట్యా గతేడాది 24 శాతం మంది ఉద్యోగాలు వదిలేశారు. వచ్చే ఆరు నెలల్లో మరో 28 శాతం మంది జాబ్ వదిలేసే ఆలోచన చేస్తున్నారు.
– ఇవంతి నివేదిక
ఇంటి నుంచి పని చేసే విధానంపై ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి స్పందించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పనిచేసే పద్ధతి ఇండియాకు అనుకూలం కాదని అన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో ఉద్యోగుల ప్రొడక్టివిటీ దెబ్బతింటుందన్న ఆయన.. సృజనాత్మకత, నైపుణ్యం, ప్రతిభ, సంప్రదింపులు వంటి అంశాల్లో మెరుగుదల సాధించడం కష్టమని అభిప్రాయపడ్డారు.
Also Read
Rashi Khanna: నేను కావాలనుకుంది ఒకటి, అయ్యింది మరొకటి.. రాశీ ఖన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Summer Health Tips: మండుతున్న ఎండలు.. వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..
Buttermilk soup: మజ్జిగ చారు.. టేస్ట్ మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో బెస్ట్