IGRUA Recruitment 2021: ఉత్తర ప్రదేశ్ లోని భారత ప్రభుత్వ పౌరవిమానయాన మంత్రిత్వశాఖకి చెందిన ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరన్ అకాడమీ (IGRUA)లో కాంట్రాక్ట్ బేసిస్ తో నియామకాలు చేపట్టడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ ఉద్యోగం కోసం పూర్తి వివరాలను తెలుసుకోవడం కోసం http://igrua.gov.in/ వెబ్ సైట్ ను దర్శించాలి. మొత్తం 15 ఖాళీలను పూర్తి చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ ను ఈమెయిల్ / ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. దరఖాస్తును ఈ-మెయిల్ ద్వారా పంపించాలని అనుకునేవారు hrmigrua @gmail.com కు పంపించాల్సి ఉంది.
ఉద్యోగ వివరాలు :
1) జూనియర్ ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్ (మెకానికల్): 07
2) ఎయిర్‌క్రాప్ట్ హెల్పర్ (మెకానికల్ ): 08
మొత్తం ఖాళీలు : 15
జూనియర్ ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్ ఉద్యోగానికి అర్హత:
ఇంజినీరింగ్ డిప్లొమా (ఎయిర్‌క్రాప్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ మెకానికల్ విభాగం) / ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలి.
ఎయిర్‌క్రాప్ట్ హెల్పర్ కు అర్హత :
ఇంజినీరింగ్ డిప్లొమా (ఎయిర్‌క్రాప్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ మెకానికల్ విభాగం) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.
వయస్సు : 45 ఏళ్లు గరిష్ట పరిమితి
వేతనం : నెలకు రూ. 20,000 – 70,000 /-
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్ , రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తులకు ప్రారంభతేది: జూలై 09, 2021.
దరఖాస్తులకు చివరితేది: జూలై 23, 2021.
దరఖాస్తులను పోస్టల్ ద్వారా పంపించడానికి చిరునామా:
HR Manager
Head Office
Fursatganj
uttar pradesh
Also Read: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సీనియర్ హీరో సుమన్