ISRO Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఇస్రోలో 160 ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలు

| Edited By: Shaik Madar Saheb

Jul 02, 2021 | 9:18 AM

ISRO Recruitment 2021:  నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. వివిధ రంగాల్లో రోజుకో నోటిఫికేషన్‌ విడుదల అవుతోంది. తాజాగా ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌..

ISRO Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఇస్రోలో 160 ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలు
Follow us on

ISRO Recruitment 2021:  నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. వివిధ రంగాల్లో రోజుకో నోటిఫికేషన్‌ విడుదల అవుతోంది. తాజాగా ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) ఆధ్వర్యంలోని లిక్విడ్‌ ప్రొపెల్షన్‌ సిస్టమ్‌ సెంటర్‌ 160 అప్రెంటిస్‌ల ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీఈ, బీటెక్‌, డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. జులై 26 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.lpsc.gov.in/ వెబ్‌సైట్‌ చూడవచ్చు.

మొత్తం ఖాళీలు: 160
గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు: 73
టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లు: 87

విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌, లైబ్రరీ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, టొమొబైల్‌ ఇంజనీరింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, కెమికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఆ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.

అర్హత: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లకు సంబంధిత విభాగంలో కనీసం 65 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లకు సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.

ఎంపిక విధానం: అకాడమిక్‌ ప్రతిభ ఆధారంగా ఈ పోస్టులను ఎంపిక చేస్తారు.
స్టయిపెండ్‌: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లకు నెలకు రూ.9,000; టెక్నీషియన్‌ అప్రెంటీస్‌లకు నెలకు రూ.8,000 చెల్లించనున్నారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 26, 2021

ఇవీ కూడా చదవండి:

DFCCIL: రైల్వే శాఖలో 1074 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ జూలై 23.. పూర్తి వివరాలు..!

Bank Of Baroda Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..