IOCL Recruitment: ఇండియన్‌ ఆయిల్‌ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే..

| Edited By: Ram Naramaneni

Dec 18, 2021 | 9:19 AM

IOCL Recruitment: ఇండియన్‌ ఆయిల్‌ లిమిటెడ్‌ (IOCL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశంలోని అతిపెద్ద చమురు పంపిణీ దారులైన ఈ సంస్థ అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనుంది...

IOCL Recruitment: ఇండియన్‌ ఆయిల్‌ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే..
Iocl
Follow us on

IOCL Recruitment: ఇండియన్‌ ఆయిల్‌ లిమిటెడ్‌ (IOCL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశంలోని అతిపెద్ద చమురు పంపిణీ దారులైన ఈ సంస్థ అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు ఉన్నాయి. ఏయో విభాగాలల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, విద్యార్హత ఏంటి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 300 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఫిట్టర్‌, ఎలక్ట్రీటీషియన్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, మెషినిస్ట్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌ పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి, ఐటీఐ, ఇంటర్‌, డిగ్రీ చేసి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఈ పోస్టులు దక్షిణాది రీజియన్‌లోని తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ పరిధిలో ఖాళీగా ఉన్నాయి.

* మొత్తం 300 ఖాళీల్లో తెలంగాణ 60, ఆంధ్రప్రదేశ్‌ 55, కేరళ 49, కర్ణాటక 52, తమిళనాడు, పాండిచ్చేరి 84 చొప్పున పోస్టులను కేటాయించారు.

* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 27-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* రాత పరీక్షను 2022, జనవరి 9న నిర్వహించనున్నారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: IRCTC Tour Package: ఐఆర్సీటీసీ ప్యాకేజీతో అందాల అస్సాం..మేస్మరైజింగ్ మేఘాలయ తిరిగొచ్చేయొచ్చు ఇలా..

Vitamin B12: విటమిన్ B-12 లభించే ఫుడ్ ఐటెమ్స్ ఇవే.. శారీరక, మానసిక సమస్యలకు చెక్ పెట్టాలంటే ఇలా చేయండి..

Vitamin B12: విటమిన్ B-12 లభించే ఫుడ్ ఐటెమ్స్ ఇవే.. శారీరక, మానసిక సమస్యలకు చెక్ పెట్టాలంటే ఇలా చేయండి..