Indian Navy Jobs: అవివాహిత యువతకు ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్షలేదు

ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్‌ఏ)లో 2026 జనవరి సెషన్‌కు సంబంధించి షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఇండియన్ నేవీ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఎవరైనా ఫిబ్రవరి 25వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవవచ్చు..

Indian Navy Jobs: అవివాహిత యువతకు ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్షలేదు
Indian Navy Jobs

Updated on: Feb 18, 2025 | 6:49 AM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారతీయ నౌకాదళంలో నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. కేరళలోని ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్‌ఏ)లో 2026 జనవరి సెషన్‌కు సంబంధించి షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కోర్సులో ప్రవేశాలకు సంబంధించి అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఇండియన్ నేవీ దరఖాస్తులు కోరుతూ ఈ ప్రకటన జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 270 నేవీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఎవరైనా ఫిబ్రవరి 25, 2025వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవవచ్చు. షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్- జనవరి 2026 కోర్సు ప్రవేశ ప్రక్రియ, ఎంపిక విధానం, అర్హతలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు.

బ్రాంచుల వారీగా ఖాళీల వివరాలు

  • ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌ (జీఎస్‌(ఎక్స్‌)/ హైడ్రో కేడర్‌) పోస్టుల సంఖ్య: 60
  • పైలట్ పోస్టుల సంఖ్య: 26
  • నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ (అబ్జర్వర్స్‌) పోస్టుల సంఖ్య: 22
  • ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పోస్టుల సంఖ్య: 18
  • లాజిస్టిక్స్ పోస్టుల సంఖ్య: 28
  • ఎడ్యుకేషన్‌ పోస్టుల సంఖ్య: 15
  • ఇంజినీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్) పోస్టుల సంఖ్య: 38
  • ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్) పోస్టుల సంఖ్య: 45
  • నావల్‌ కన్‌స్ట్రక్టర్‌ పోస్టుల సంఖ్య: 18

ఆయా పోస్టులను బట్టి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీకాం, బీఈ, బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో ఈ నెల 24, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా అప్లికేషన్లను షార్ట్‌లిస్ట్ చేశాక, అభ్యర్ధులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. అనంతరం 3 ఏళ్లపాటు శిక్ష ఇస్తారు. పూర్తి స్థాయి ఉద్యోగంలో చేరాక నెలకు రూ.1,10,000 చొప్పున ప్రారంభ వేతనం ఇస్తారు.

ఇండియన్ నేవీ ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగ నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.