Indian Navy Jobs 2025: నిరుద్యోగులకు అలర్ట్.. పదో తరగతి అర్హతతో ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు..

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత నౌకాదళం (Indian Navy).. గ్రూప్‌ ‘సి’, నాన్‌ గెజిటెడ్‌, ఇండస్ట్రియల్‌ తదితర ట్రేడ్స్‌మెన్‌ స్కిల్డ్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం..

Indian Navy Jobs 2025: నిరుద్యోగులకు అలర్ట్.. పదో తరగతి అర్హతతో ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు..
Indian Navy Jobs

Updated on: Aug 14, 2025 | 8:18 AM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత నౌకాదళం (Indian Navy).. గ్రూప్‌ ‘సి’, నాన్‌ గెజిటెడ్‌, ఇండస్ట్రియల్‌ తదితర ట్రేడ్స్‌మెన్‌ స్కిల్డ్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1,266 ట్రేడ్స్‌మెన్‌ స్కిల్డ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇండియన్‌ నేవీలో ఇప్పటికే వివిధ యూనిట్లలోని శిక్షణ పొందిన ఎక్స్‌ నేవల్‌ (ఎక్స్‌ అప్రెంటిస్‌ ఆఫ్‌ యార్డ్‌ అప్రెంటిస్‌ స్కూల్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ నేవీ) అప్రెంటిస్‌ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ట్రేడ్స్‌మెన్‌ స్కిల్డ్‌ (ఎక్స్‌ నేవల్‌ అప్రెంటిస్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు.. సివిల్‌ వర్క్స్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ గైరో, ఫౌండ్రీ, హీట్‌ ఇంజిన్‌, ఇన్‌స్ట్రుమెంట్‌, మెషిన్‌ తదితర ట్రేడుల్లో ఏదైనా ఒకదానిలో తప్పనిసరిగా అప్రెంటిస్‌ ట్రైనింగ్‌ పూర్తిచేసి సర్టిఫికెట్‌ ఉండాలి. అలాగే పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్‌ 2, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్‌ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హులైన వారికి నెలకు రూ.19,000 నుంచి రూ.63,200 వరకు ఇతర అలవెన్సులు కల్పిస్తారు. ఇతర పూర్తి నోటిఫికేషన్‌ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.