Indian Navy Recruitment 2021: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఆయా రంగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నాయి.ఇంటర్మీడియట్ పాస్ అయినవారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి . ఇండియన్ నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌ను ప్రకటించింది. అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. పెళ్లికాని యువకులు మాత్రమే ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేయాలి. ఎంపికైనవారు కేరళలోని ఎజిమలలోని ఇండియన్ నేవి అకాడమీలో నాలుగేళ్ల బీటెక్ కోర్స్ చేయాల్సి ఉంటుంది. 2022 జనవరిలో బీటెక్ డిగ్రీ కోర్స్ ప్రారంభం అవుతుంది.
మొత్తం 35 ఖాళీలను ప్రకటించింది ఇండియన్ నేవీ. ఎడ్యుకేషన్, ఎగ్జిక్యూటీవ్, టెక్నికల్ బ్రాంచ్‌లో ఈ ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ 2021 అక్టోబర్ 1న ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 అక్టోబర్ 10 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
►ఎడ్యుకేషన్ బ్రాంచ్ 5ఎగ్జిక్యూటీవ్, టెక్నికల్ బ్రాంచ్ 30
► గుర్తుంచుకోవాల్సిన అంశాలు:
► దరఖాస్తు ప్రారంభం- 2021 అక్టోబర్ 1
► దరఖాస్తుకు చివరి తేదీ- 2021 అక్టోబర్ 10
► ఇంటర్వ్యూ- 2021 అక్టోబర్ లేదా నవంబర్
విద్యార్హతలు- ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్‌తో 10+2 కనీసం 70 శాతం మార్కులతో పాస్ కావాలి. జేఈఈ మెయిన్ పరీక్ష రాసినవాళ్లు దరఖాస్తు చేయాలి. టెన్త్ లేదా ఇంటర్‌లో ఇంగ్లీష్‌లో 50 శాతం మార్కులు ఉండాలి.
వయస్సు- 2002 జూలై 2 నుంచి 2005 జనవరి 1 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేయాలి.
కోర్సులు- అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ లభిస్తుంది.
జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ జరిగే ప్రాంతం- విశాఖపట్నం, బెంగళూరు, భోపాల్, కోల్‌కతా. అభ్యర్థులు వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత హోమ్ పేజీలో Current Events లో 10+2 B.Tech Cadet Entry Scheme లింక్ పైన క్లిక్ చేయాలి. ఇక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Apply Online పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత అభ్యర్థి తన వివరాలతో అకౌంట్ క్రియేట్ చేయాలి. ఆ తర్వాత బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌కు దరఖాస్తు చేయాలి. అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.