Indian Navy Recruitment: ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు.. 2500 ఖాళీల భర్తీతో భారీ నోటిఫికేషన్‌..

| Edited By: Anil kumar poka

Oct 18, 2021 | 5:22 PM

Indian Navy Recruitment 2021: ఇండియన్‌ నేవీ భారీ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌ (ఏఏ), సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) విభాగాల్లో కలిసి మొత్తం 2500 ఖాళీలను..

Indian Navy Recruitment: ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు.. 2500 ఖాళీల భర్తీతో భారీ నోటిఫికేషన్‌..
Indian Navy Jobs
Follow us on

Indian Navy Recruitment 2021: ఇండియన్‌ నేవీ భారీ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌ (ఏఏ), సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) విభాగాల్లో కలిసి మొత్తం 2500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌ భాగంగా ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌ (ఏఏ), సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌ (ఏఏ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 60 శాతం మార్కులతో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ/ బయోలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత పొంది ఉండాలి.

* సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 60 శాతం మార్కులతో గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ/ బయోలజీ / కంప్యూటర్‌ సైన్స్‌లో 10+2 ఉత్తీర్ణత పొంది ఉండాలి.

* అవివాహిత పురుషులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

* అభ్యర్థులను రాతపరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* రాత పరీక్ష హిందీ, ఇంగ్లిష్‌లో ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు. ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌ అభ్యర్థులకు 09 వారాలు, సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌ అభ్యర్థులకు 22 వారాలు శిక్షణ ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు 2022 ఫిబ్రవరి నుంచి కోర్సు ప్రారంభమవుతుంది.

* శిక్షణా కాలంలో అభ్యర్థులకు నెలకు రూ.14,600 చెల్లిస్తారు. అనంతరం డిఫెన్స్‌ పే మ్యాట్రిక్స్‌ ఆధారంగా రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు చెల్లిస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇండియన్‌ నేవీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి..

Also Read: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)

VVS Laxman: ఎన్‎సీఏ హెడ్ కోచ్ ఆఫర్ ఇచ్చిన బీసీసీఐ.. తిరస్కరించిన వివిఎస్ లక్ష్మణ్!..

ALIMCO Recruitment: ఆర్టిఫిషియల్‌ లింబ్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

Lambasingi: పోలీస్ వర్సెస్ లంబసింగి గ్రామస్తులు. గొడవ మొదలైంది. ఇంతకీ ఏంటా రగడ?