AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Navy Recruitment: పదో తరగతి అర్హతతో ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు.. రూ. 69వేల వరకు జీతం పొందే అవకాశం.

Indian Navy Recruitment 2021: భారత నావికా దళం పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. పదో తరగతి అర్హతతో తీసుకోనున్న ఈ పోస్టుల కోసం అవివాహిత పురుషులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మొత్తం...

Indian Navy Recruitment: పదో తరగతి అర్హతతో ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు.. రూ. 69వేల వరకు జీతం పొందే అవకాశం.
Indian Navy Jobs
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 09, 2021 | 4:19 PM

Share

Indian Navy Recruitment 2021: భారత నావికా దళం పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. పదో తరగతి అర్హతతో తీసుకోనున్న ఈ పోస్టుల కోసం అవివాహిత పురుషులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మొత్తం 350 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 350 ఖాళీల్లో చెఫ్‌, హైజీనిస్ట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణత సాధించడంతోపాటు ఇండియన్‌ నేవీ నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. * అభ్యర్థులు ఏప్రిల్‌ 1, 2001 నుంచి సెప్టెంబర్‌ 30, 2004 మధ్య జన్మించి ఉండాలి. * పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో నెలకు రూ. 14,600 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న వారికి విభాగాలను అనుసరించి రూ. 21,700 నుంచి 69,100 జీతంగా చెల్లిస్తారు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ జులై 19, 2021న మొదలై జులై 23, 2021న ముగియనుంది. * దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఫిజికల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇందూలోనూ అర్హత సాధించిన వారికి మెడికల్‌ పరీక్ష నిర్వహించి శిక్షణకు పంపుతారు. * శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు.. ఐఎన్‌ఎస్‌ చిల్కాలో 12వ వారాల పాటు శిక్షణ ఇస్తారు. అనంతరం బ్రాంచి/ట్రేడ్‌ల వారీగా విధుల్లోకి తీసుకుంటారు. * రాత పరీక్షను హిందీ, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్‌ సైన్స్‌ అండ్‌ మ్యాథమెటిక్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌ విభాగాల్లో ఉంటుంది. * మెడికల్‌ టెస్ట్‌లో భాగంగా అభ్యర్థి 7 నిమిషాల్లో 1.6 కిలోమీట‌ర్ల ప‌రుగు పూర్తి చేయాలి. 20 స్క్వాట్స్‌, 10 పుష్ అప్స్ చేయాల్సి ఉంటుంది. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: NRTI Recruitment 2021: టీచింగ్ మీద ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశం.. భారీ వేతనంతో ఎన్‌ఆర్‌టీఐ నోటిఫికేషన్

TS Inter: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు ముఖ్య గమనిక.. ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్స్‌ గడువు పెంచుతూ నిర్ణయం.

I-T Department Recruitment 2021: ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు.. దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 25

Follow Us
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్
టెన్త్‌, ఇంటర్ రిజల్ట్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
టెన్త్‌, ఇంటర్ రిజల్ట్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
వైశాఖ పౌర్ణమి మహత్యం.. పూజా విధానాలు, దాన ధర్మాలు.. ఆశ్చర్యకర..
వైశాఖ పౌర్ణమి మహత్యం.. పూజా విధానాలు, దాన ధర్మాలు.. ఆశ్చర్యకర..
UGC NET జూన్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. లింక్ ఇదే
UGC NET జూన్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. లింక్ ఇదే
56 ఏళ్ల వయసులోనూ తగ్గని పరువం.. పాప్ సింగర్..
56 ఏళ్ల వయసులోనూ తగ్గని పరువం.. పాప్ సింగర్..
టెన్త్‌ సప్లిమెంటరీ, రీకౌంటింగ్‌ 2026కు ఫీజు చెల్లింపులు ప్రారంభం
టెన్త్‌ సప్లిమెంటరీ, రీకౌంటింగ్‌ 2026కు ఫీజు చెల్లింపులు ప్రారంభం
మే 1 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగాల్లో శుభవార్తలు..
మే 1 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగాల్లో శుభవార్తలు..