భారత త్రివిధ దళాలకు చెందిన ఇండియన్ నేవీలో 372 ఛార్జ్‌మ్యాన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ నావల్ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలక్ట్రికల్, వెపన్, ఇంజినీరింగ్, కన్‌స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్, ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్.
ఎలక్ట్రికల్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ ఫిట్టర్, గైరో ఫిట్టర్, రేడియో ఫిట్టర్, రాడార్ ఫిట్టర్, సోనార్ ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్ ఫిట్టర్, కంప్యూటర్ ఫిట్టర్, వెపన్ ఫిట్టర్, బాయిలర్ మేకర్, ఇంజిన్ ఫిట్టర్, ఫౌండర్, జీటీ ఫిట్టర్, ఐస్ ఫిట్టర్, పైప్ ఫిట్టర్, మెషినిస్ట్, మెషినరీ కంట్రోల్ ఫిట్టర్, రెఫ్రిజిరేషన్ అండ్ ఏసీ ఫిట్టర్, ప్లేటర్, వెల్డర్, షిప్ రైట్, లాగర్, రిగ్గర్, షిప్ ఫిట్టర్, మిల్ రైట్, ఐస్ ఫిట్టర్ క్రేన్, పెయింటర్, సివిల్ వర్క్స్, పీపీ అండ్ సి.
మే 29, 2023వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు మే 29, 2023వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.278 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ/మహిళా అభ్యర్ధులు ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.35,400ల నుంచి రూ.1,12,400ల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు కల్పిస్తారు. ఎంపికైన అభ్యర్థులు హెడ్‌క్వార్టర్స్ వెస్ట్రన్ నేవల్ కమాండ్ (ముంబయి), హెడ్‌క్వార్టర్స్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ (విశాఖపట్నం), హెడ్‌క్వార్టర్స్ సదరన్ నేవల్ కమాండ్ (కొచ్చి), హెడ్‌క్వార్టర్స్ అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ (పోర్ట్ బ్లెయిర్) యూనిట్లలో పని చేయాల్సి ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.