Bank Jobs: బ్యాంక్‌ జాబ్స్‌ ప్రిపేర్‌ అవుతున్న వారికి అలర్ట్‌.. ఇండియన్‌ బ్యాంక్‌లో రూ. 70 వేల జీతంతో ఉద్యోగాలు..

|

Feb 07, 2023 | 3:31 PM

బ్యాంక్‌ జాబ్స్‌ కోసం ప్రిపేర్‌ అవుతోన్న అభ్యర్థులకు శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఇండియన్ బ్యాంక్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) రిక్రూట్‌మెంట్ 2023 షార్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు...

Bank Jobs: బ్యాంక్‌ జాబ్స్‌ ప్రిపేర్‌ అవుతున్న వారికి అలర్ట్‌.. ఇండియన్‌ బ్యాంక్‌లో రూ. 70 వేల జీతంతో ఉద్యోగాలు..
Indian Bank Jobs
Follow us on

బ్యాంక్‌ జాబ్స్‌ కోసం ప్రిపేర్‌ అవుతోన్న అభ్యర్థులకు శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఇండియన్ బ్యాంక్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) రిక్రూట్‌మెంట్ 2023 షార్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఇందులో భాగంగా స్కేల్ I, II, III & IVలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 203 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌ (క్రెడిట్‌ ఆఫీసర్‌) స్కేల్‌ 2 (5), స్కేల్‌ 3 (30), స్కేల్‌ 4 (25) పోస్టులున్నాయి. రిస్క్‌ ఆఫీసర్‌ స్కేల్‌ 2 (05), స్కేల్‌ 3 (05), స్కేల్‌ 4 (5) ఖాళీలు ఉన్నాయి. ఐటీ/కంప్యూటర్‌ ఆఫీసర్‌ స్కేల్‌ 2 (05), స్కేల్‌ 3 (08), స్కేల్‌ 4 (10) ఖాళీలు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ విభాగంలో స్కేల్‌ 3 (5), స్కేల్‌ (2) ఖాళీలు ఉన్నాయి. ఇక మార్కెట్ ఆఫీసర్‌ విభాగంలో మొత్తం 13, ఫారెక్స్‌ ఆఫీసర్‌ విభాగంలో (10), పరిశ్రమల అభివృద్ధి అధికారి (50), హెచ్‌ఆర్‌ ఆఫీసర్‌ (05) పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల విద్యార్హతలు, వయసు వటి పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు స్కేల్ I: రూ.36,000, స్కేల్ II: రూ.48,170, స్కేల్ III: రూ.63,840, స్కేల్ IV: రూ.76,010 జీతంగా చెల్లిస్తారు.

* ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.175+ GST, ఓబీసీ/ఇతరులు రూ.850+ GST ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..