Indian Army Recruitment 2021: ఇండియన్ ఆర్మీ ఎస్ఎస్‌సీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 8 పోస్టులను భర్తీచేయనున్నారు. వీటిలో 6 పురుషులకు, 2 పోస్టులకు మహిళలకు కేటాయించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ నేటితో (శుక్రవారం)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* ఇండియన్ ఆర్మీలోని జడ్జ్ అడ్వకేట్ జనరల్ విభాగంలో పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో ఎల్ఎల్‌బీలో డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థులు బార్ కౌన్సిల్ ఇండియా/స్టేట్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అర్హులై ఉండాలి.
* మే 7న ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ నేటితో (శుక్రవారం) ముగియనుంది.
* అభ్యర్థులు ముందుగా ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in లోకి వెళ్లాలి.
* అనంతరం రిజిస్ట్రేషన్ లింక్‌లోని ఆఫీసర్ ఎంట్రీ అప్లిన్/లాగిన్ బటన్‌పై క్లిక్ చేయాలి.
* తర్వాత పేర్కొన్న సూచనలను జాగ్రత్తగా చదివి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్‌ను నింపాలి.
* అనంతరం సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేసి.. కన్ఫామ్ పేజీపై క్లిక్ చేయాలి.
* భవిష్యత్తు అవసరాల కోసం హార్డ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
Also Read: NASA New Mission Venus: శుక్రుడి అంతు తేలుస్తాం..! వీనస్‌పై ఫోకస్ పెట్టిన నాసా..!
SP Balu: బాలు ఎప్పటికీ మనతోనే ఉంటారు.. మా చెవులు రింగుమని మారుమోగేదాక ఆయనే పాటలే పాడుకుంటాం!