Indian Army Recruitment: ఎన్‌సీసీ సర్టిఫికేట్‌ ఉన్న వారికి ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

Indian Army Recruitment: ఇండియన్‌ ఆర్మీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా ఎన్‌సీసీ (NCC) స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌ 2022ను విడుదల చేసింది. ఈ క్రమంలో 53వ కోర్సు కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది...

Indian Army Recruitment: ఎన్‌సీసీ సర్టిఫికేట్‌ ఉన్న వారికి ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 19, 2022 | 9:00 AM

Indian Army Recruitment: ఇండియన్‌ ఆర్మీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా ఎన్‌సీసీ (NCC) స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌ 2022ను విడుదల చేసింది. ఈ క్రమంలో 53వ కోర్సు కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 55 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో పురుషులు (50), మహిళలు (05) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన ఏదైన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే NCC ‘C’ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 19 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సి అవసరం లేదు.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభ తేదీ 17-08-2022న ప్రారంభమై 15-09-2022తో ముగియనుంది.

* అభ్యర్థులను మొదట షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామ్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..