Indian Army AOC Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ త్రివిధ దళాలకు చెందిన ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ (HAOC) తెలంగాణతో సహా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో.. 3068 ట్రేడ్స్‌మెన్ మేట్, ఫైర్‌మ్యాన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు (Tradesman Mate Posts) దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్ధుల వయసు సెప్టెంబర్ 1, 2022వ తేదీ నాటికి 18 నుంచి 25 యేళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతలు, ఎంపిక విధానం వంటి ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత చెక్ చేసుకోవచ్చు. ఆర్మీలో చేరి దేశ రక్షణకు సేవ చేయాలనే ఆసక్తి కలిగిన యువత ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 21, 2022వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.18,000ల నుంచి రూ.63,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.