IAF Recruitment: ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. అర్హులు ఎవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

|

Nov 08, 2021 | 4:46 PM

IAF Recruitment: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (IAF) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ కమాండ్లలో..

IAF Recruitment: ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. అర్హులు ఎవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
Indian Air Force Jobs
Follow us on

IAF Recruitment: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (IAF) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ కమాండ్లలో గ్రూప్‌-సీ సివిలియన్‌ పోస్టులను భర్తీచేయనున్నారు. ఏయో పోస్టులు ఖాళీగా ఉన్నాయి, విద్యార్హతులు ఏంటి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 83 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఎల్‌డీసీ, ఎంటీఎస్, సూపరింటెండెంట్‌(స్టోర్‌), సీఎంటీడీ, కుక్‌ వంటి పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా పదో తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.

* విద్యార్హతతో పాటు సంబంధిత అనుభవం ఉండాలి. అలాగే నిర్దేశిత శారీరక ప్రమాణాలు కూడా తప్పనిసరి.

* అభ్యర్థుల వయసు 18–25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను సంబంధిత రాష్ట్రాల ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్లకు పంపించాలి.

* అభ్యర్థులను రాత పరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌/ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 30-11-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి పూర్తివివరాలకు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Also Read: Akhanda Title Song: బాలయ్య అభిమానులకు మాస్‌ కిక్‌.. అలరిస్తోన్న అఖండ టైటిల్‌ సాంగ్‌..

Entertainment: డేగల బాబ్జీ వచ్చేశాడు.. యాభై దెయ్యాలు బెదిరిస్తున్నాయంటున్న బండ్ల గణేష్‌ ..

రంగంలోకి దిగనున్న మెగా మేనల్లుడు