IPPB Recruitment: ఇండియా పోస్ట్ పేమెంట్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖకి చెందిన న్యూఢిల్లీలోని ఈ సంస్థలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో మేనేజర్; సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ వంటి ఖాళీలు ఉన్నాయి.
* ఇంటిగ్రేషన్ ఆర్కిటెక్ట్, డిజిటల్ టెక్నాలజీ, ఐటీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి విభాగాలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టులను అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* అభ్యర్థలుకు సంబంధిత పనిలో అనుభవంతోపాటు సంబంధిత నైపుణ్యాలు తప్పనిసరి.
* అభ్యర్థుల వయసు 01-09-2021 నాటికి 23 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 94,000 నుంచి రూ. 2,92000 జీతంగా అందిస్తారు.
* అభ్యర్థులను అసెస్మెంట్, గ్రూప్ డిస్కషన్/ ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 23-10-2021ని నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Tanish: ‘మోహన్ బాబు అమ్మను తిడితే తట్టుకోలేకపోయా’.. తనీష్ ఎమోషనల్ కామెంట్స్
Ram Gopal Varma: దేవుడిని నమ్మనని చెప్పే ఆర్జీవీ.. గుడి మెట్లు ఎక్కాడు. ఇదంతా ఎవరి కోసమో తెలుసా.?
Viral Video: అరుదైన జీవి ‘సింహం చేప’… అందంగా ఉందని పట్టుకుంటే ఇంకా అంతే సంగతులు..! వీడియో