AP & TS GDS Results: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ జీడీఎస్ 2023 ఫలితాలు విడుదల.. ఇక్కడ నేరుగా చెక్‌ చేసుకోండి

రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సర్కిళ్లలో తదుపరి దశ అయిన ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైనవారి వివరాలను పోస్టల్ శాఖ మార్చి 11 (శనివారం) విడుదల చేసింది..

AP & TS GDS Results: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ జీడీఎస్ 2023 ఫలితాలు విడుదల.. ఇక్కడ నేరుగా చెక్‌ చేసుకోండి
India Post GDS Results 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 12, 2023 | 12:43 PM

ఇండియా పోస్ట్‌ తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న దాదాపు 40,889 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 2,480, తెలంగాణలో 1,266 వరకు ఖాళీలు ఉన్నాయి. పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్‌లు, రిజర్వేషన్‌ ఆధారంగా మెరిట్‌లో ఉన్న వారిని ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సర్కిళ్లలో తదుపరి దశ అయిన ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైనవారి వివరాలను పోస్టల్ శాఖ మార్చి 11 (శనివారం) విడుదల చేసింది. ఎటువంటి రాత పరీక్షలేకుండా మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేసే క్రమంలో ఏ ఇద్దరు అభ్యర్థులకైనా ఒకే మార్కులు ఉండి ఉద్యోగానికి ఎంపికైతే.. వారిలో ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యం ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులు మార్చి 21వ తేదీలోగా సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.

అనంతరం ఫైనల్‌గా ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. ఎంపికైనవారికి ఫోన్‌ ఎస్‌ఎంఎస్‌ లేదా ఈమెయిల్‌ లేదా పోస్టు ద్వారా సమాచారం అందిస్తారు. రోజుకు నాలుగు గంటలపాటు పని చేస్తే సరిపోతుంది. ఉద్యోగ విధులతోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలు అందించిన వారికి అదనంగా ఇంటెన్సివ్‌ అందజేస్తారు. ఈ విధమైన విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్‌/కంప్యూటర్‌/స్మార్ట్‌ ఫోన్‌ లాంటివి తపాలా శాఖ అందిస్తుంది. ఇతర వివరాలు వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ ఫలితాల-2023 కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ జీడీఎస్ ఫలితాల-2023 కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు