Postal GDS Results: పోస్టల్‌ జీడీఎస్‌ ఉద్యోగాలకు సెకండ్‌ మెరిట్‌ లిస్ట్‌ వచ్చేసింది.. తెలుగు రాష్ట్రాల్లో కట్ ఆఫ్ ఎంతో తెలుసా?

|

Sep 18, 2024 | 6:38 AM

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని జీడీఎస్‌ పోస్టుల ఫలితాలు తొలి విడత వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పోస్టల్‌ శాఖ రెండో దశ మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేసింది. వివిధ బ్రాంచ్‌ పోస్ట్ ఆఫీసుల్లో మొత్తం 44,228 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులకు దరఖాస్తు చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న..

Postal GDS Results: పోస్టల్‌ జీడీఎస్‌ ఉద్యోగాలకు సెకండ్‌ మెరిట్‌ లిస్ట్‌ వచ్చేసింది.. తెలుగు రాష్ట్రాల్లో కట్ ఆఫ్ ఎంతో తెలుసా?
India Post GDS 2024 2nd merit list
Follow us on

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 18: దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని జీడీఎస్‌ పోస్టుల ఫలితాలు తొలి విడత వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పోస్టల్‌ శాఖ రెండో దశ మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేసింది. వివిధ బ్రాంచ్‌ పోస్ట్ ఆఫీసుల్లో మొత్తం 44,228 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులకు దరఖాస్తు చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అధికారులు.. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల రెండో జాబితాను సెప్టెంబర్‌ 17న విడుదల చేశారు.

మొత్తం పోస్టుల్లో తెలుగు రాష్ట్రాల్లో 2,336 వరకు ఉన్నాయి. వీటిల్లో ఆంధ్రప్రదేశ్ 1,355 పోస్టులు ఉండగా, తెలంగాణలో 981 చొప్పున పోస్టులను భర్తీ చేయన్నారు. తాజాగా విడుదల చేసిన రెండో మెరిట్‌ లిప్టులో ఏపీ నుంచి 664 మంది, తెలంగాణ నుంచి 468 మంది షార్ట్‌ లిస్ట్‌ అయ్యారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. వీరందరినీ కంప్యూటర్ జనరేటెడ్‌ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్.. ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేశారు. ఎంపికైన వారందరూ అక్టోబర్‌ 3వ తేదీ లోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది ఫలితాలను వెల్లడిస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా ఆయా పోస్టల్‌ విభాగాల్లో సేవలు అందించాల్సి ఉంటుంది.

ధ్రువపత్రాల వెరిఫికేషన్‌కు హాజరయ్యేవారు ఈ కింది సర్టిఫికెట్లను తమతోపాటు తప్పనిసరిగా తీసుకెళ్లాలి..

  • దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన ఆన్‌లైన్‌ అప్లికేషన్‌
  • పుట్టిన తేదీ ధ్రువీకరణ సంబంధించి పదో తరగతి మార్కుల మెమో
  • 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
  • అభ్యర్థి పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు
  • ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌,
  • కుల ధ్రువీకరణ పత్రం
  • ఆధార్‌ కార్డు
  • ఆదాయ ధ్రువీకరణపత్రం
  • దివ్యాంగులైతే దివ్యాంగ ధ్రువీకరణ పత్రం
  • మెడికల్‌ సర్టిఫికెట్‌

ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ రెండో మెరిట్‌ లిస్ట్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ జీడీఎస్ రెండో మెరిట్‌ లిస్ట్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.