I-T Department Recruitment 2021: నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. దరఖాస్తు చేసుకుంటున్న అర్హత, ఆసక్తి గల అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఎన్నో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు వెలువడుతున్నాయి. తాజాగాఆదాయ పన్ను (ఐటీ)శాఖలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఆసక్తి, అర్హత గలవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్ ద్వారా చేసుకునే దరఖాస్తులు వచ్చే నెల 25వ తేదీ వరకు గడువు ఉంటుందని ఆ శాఖ పేర్కొంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 150కిపైగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఇందులో ఎంటీఎస్, ట్యాక్స్ అసిస్టెంట్, ఇన్‌కం ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఇవి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు.
ఇందులో ఎంటీఎస్ 64, ట్యాక్స్ అసిస్టెంట్ 83, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్ 8 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు ఎంటీఎస్ పోస్టుకు పదో తరగతి, మిగిలిన పోస్టులకు డిగ్రీ పూర్తిచేసి ఉండాల్సి ఉంటుంది. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో, యూనివర్సిటీ స్థాయి టోర్నమెంట్లు, రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ జట్టులో సభ్యుడై జాతీయ క్రీడల్లో ఏదో ఒకటి పాల్గొని ఉండాలి. అదేవిధంగా అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్లు ఉండాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 25. వెబ్‌సైట్: incometaxmumbai.gov.in
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల షార్ట్‌లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు. సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత అవసరమైతే ప్రొఫిషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.