McDonald: నిరుద్యోగులకు మెక్‌డొనాల్డ్స్‌ గుడ్‌న్యూస్‌.. ఇండియాలో కొత్తగా 5000 ఉద్యోగాలు, భారీగా స్టోర్స్ ఏర్పాటు.

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఉద్యోగుల తొలగింపు వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్థికమాంద్యం నేపథ్యంలో కంపెనీలు భారీ ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అంతటా భయాందోళనలు నెలకొన్నాయి. అయితే..

McDonald: నిరుద్యోగులకు మెక్‌డొనాల్డ్స్‌ గుడ్‌న్యూస్‌.. ఇండియాలో కొత్తగా 5000 ఉద్యోగాలు, భారీగా స్టోర్స్ ఏర్పాటు.
Mcdonald Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 13, 2022 | 8:51 PM

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఉద్యోగుల తొలగింపు వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్థికమాంద్యం నేపథ్యంలో కంపెనీలు భారీ ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అంతటా భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఇలాంటి తరుణంలో అమెరికాకు చెందిన ప్రముఖ క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్‌ మెక్‌డొనాల్డ్స్‌ భారత్‌లో రానున్న మూడేళ్లలో కొత్తగా 5000 మంది ఫ్రెషర్స్‌కి ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపింది. భారత్‌లోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో కొత్తగా 300 స్టోర్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సోమవారం గౌహతిలో భారతదేశంలో అతిపెద్ద రెస్టారెంట్‌ను ప్రారంభించింది, ఇది 6,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకేసారి 220 మందికి ఆహారం అందించగలదు.

ఈ విషయమై మెక్‌డొనాల్డ్స్ ఇండియా (నార్త్ అండ్ ఈస్ట్) మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ రంజన్ మాట్లాడుతూ.. ‘కంపెనీ ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల్లో స్టోర్‌ల సంఖ్య పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నామ’ని తెలిపారు. మెక్ డొనాల్డ్ ఎంఎంజి గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ అగర్వాల్‌ను ఉత్తర, తూర్పు భారతదేశంలో అవుట్‌లెట్లను నిర్వహించడానికి తన కొత్త భాగస్వామిగా ఎంపిక చేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం నార్త్‌, ఈస్ట్‌ ఇండియాలో మెక్‌డొనాల్డ్స్‌ 156 రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. రాబోయే మూడేళ్లలో ఈ అవుట్‌లెట్ల సంఖ్యను రెట్టింపు చేయాలని చూస్తున్నారు.

ఉద్యోగుల సంఖ్య మూడేళ్లలో రెట్టింపు అవుతుందని మెక్‌డొనాల్డ్స్‌ నిర్వాహకులు చెబుతున్నారు. ఇక మెక్‌డొనాల్డ్స్‌ కొత్త స్టోర్స్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 15 ఏళ్లు నిండినవారై ఉండాలి. మల్టీటాస్క్‌ చేసే నైపుణ్యం ఉండాలి. మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, కస్టమర్ సర్వీస్‌ స్కిల్స్‌ ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..