IIT Tirupati Recruitment: తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా పలు విభాగాల్లో ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు గ్రేడ్-1 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటస్టిక్స్, ఫిజిక్స్, హ్యుమానిటిస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేన్లలో పీహెచ్‌డీ/ తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు టీచింగ్/ రిసెర్చ్/ ఇండస్ట్రియల్ అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
* అభ్యర్థుల వయసు 38 ఏళ్లు మించకూడదు. ఎస్సీలకు ఐదేళ్లు, ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు ఐదేళ్లు సడలింపు ఉంది.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ముందుగా అకడమిక్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* టీచింగ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1,01,500లతో పాటు ఇతర అలవెన్సులు అందిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ 24-12-2021తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Sabarimala: శబరిమల ప్రసాదం తయారీపై కేరళ హైకోర్టులో పిటిషన్.. వివరణ ఇవ్వాలంటూ ఆదేశం..
ఈ బూరెబుగ్గల బుజ్జాయి.. ఇప్పుడు సౌత్‌లో క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?