IIT Recruitment: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ విద్యా సంస్థ ఢిల్లీ క్యాంపస్‌లోని పలు పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 05 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అటెండెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, డిప్లొమా/గ్రాడ్యుయేషన్ డిగ్రీ, బీటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
* వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలోదరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 19,900 నుంచి రూ.63,400 వరకు చెల్లిస్తారు.
* అభ్యర్థులను ఆన్‌లైన్ ఇంటర్వ్యూఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ 20-01-2022తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..