IIT Mandi Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

|

Oct 01, 2022 | 8:55 AM

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రం మండిలోనున్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ.. 33 జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్..

IIT Mandi Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
IIT Mandi
Follow us on

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రం మండిలోనున్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ.. 33 జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి బీకాం, బ్యాచిలర్ డిగ్రీ, ఎంకాం లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధింది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ అవసరం. దరఖాస్తుదారుల వయసు 30 యేళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 25, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.500లు, ఓబీసీ అభ్యర్ధులు రూ.400, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్ధులు రూ.300లు అప్లికేషన్‌ ఫీజుగా చెల్లించవల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్‌/ట్రేడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.