IIT-Madras: ఇక ఐఐటీ మద్రాస్‌ నుంచి ఇంజనీర్లే కాదు.. నాణ్యమైన మ్యాథ్స్ టీచర్లు! కొత్త కోర్సు ప్రారంభం

|

Aug 16, 2024 | 12:19 PM

ఐఐటీ మద్రాస్‌ మరో వినూత్న ప్రయోగానికి తెరలేపింది. మ్యాథమెటిక్స్‌లో నాణ్యమైన ఉపాధ్యాయులను తయారు చేసేందుకు బీఎస్సీ బీఈడీ కోర్సులు ప్రారంభించనున్నట్లు ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్ వీ కామకోటి తెలిపారు. NIRF 2024 ర్యాంకింగ్స్‌లో వరుసగా తొమ్మిదోసారి ఐఐటీ మద్రాస్‌ టాప్‌ ర్యాంకులో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన మరుసటి రోజే ఐఐటీ మద్రాస్‌ కొత్త కోర్సును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది..

IIT-Madras: ఇక ఐఐటీ మద్రాస్‌ నుంచి ఇంజనీర్లే కాదు.. నాణ్యమైన మ్యాథ్స్ టీచర్లు! కొత్త కోర్సు ప్రారంభం
IIT-Madras
Follow us on

ఐఐటీ మద్రాస్‌ మరో వినూత్న ప్రయోగానికి తెరలేపింది. మ్యాథమెటిక్స్‌లో నాణ్యమైన ఉపాధ్యాయులను తయారు చేసేందుకు బీఎస్సీ బీఈడీ కోర్సులు ప్రారంభించనున్నట్లు ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్ వీ కామకోటి తెలిపారు. NIRF 2024 ర్యాంకింగ్స్‌లో వరుసగా తొమ్మిదోసారి ఐఐటీ మద్రాస్‌ టాప్‌ ర్యాంకులో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన మరుసటి రోజే ఐఐటీ మద్రాస్‌ కొత్త కోర్సును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఐఐటీ మద్రాస్‌ క్యాంపస్‌లో పరిశోధనలు, ఆవిష్కరణలతోపాటు మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ, ఏఐ, డేటా అనలిటిక్స్‌ కోసం ప్రత్యేక విభాగాలను ప్రారంభించింది. ఇక్కట స్పోర్ట్స్ కోటాలో కూడా ప్రవేశాలు కల్పిస్తుంది. అలాగే ఆన్‌లైన్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లను కూడా అందిస్తుంది.

ఈ సందర్భంగా డైరెక్టర్ కామరెడ్డి మాట్లాడుతూ.. బీఎస్సీ బీఈడీ , కంప్యూటింగ్‌లో బీఎస్సీ కోర్సులను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తున్నాం. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) సహకారంతో ఆన్‌లైన్ మోడ్‌లో BSc డిగ్రీని, BEdని అందిస్తాం. ఈ కోర్సు ద్వారా నాణ్యమైన మ్యాథమెటిక్స్‌ టీచర్లను తయారు చేయడమే మా లక్ష్యం. ఏడాదికి కనీసం 500 మంది ఉపాధ్యాయులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మేము మా స్కూల్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ స్టడీస్ ఆలోచనకు మరింత ప్రాధాన్యతనిస్తాం. ఇందులో వివిధ విభాగాలకు చెందిన ఫ్యాకల్టీ సభ్యులు ఉంటారు. MTech, PhD ప్రోగ్రాంకు వీరు భోధిస్తారు. మా ‘స్టార్టప్ 100’ ఈ ఏడాది ప్రతి మూడు రోజులకు ఒక కొత్త స్టార్టప్‌ను ప్రారంభించనుంది. IIT-M అడ్మిషన్‌లో ఆర్టిస్టులకు కల్చరల్ కోటాను ప్రవేశబెట్టబోతున్నామని అన్నారు.

IIT-M గత తొమ్మిదేళ్లుగా దేశంలోనే టాప్ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌గా ఫస్ట్ ర్యాంకులో కొనసాగుతుంది. అయితే టాప్ 100 JEE ర్యాంకర్లు IIT బాంబేను ఎందుకు ఎంచుకుంటున్నారనే దానికి ఆయన సమాధానం చెబుతూ.. టాపర్లను ఆకర్షించడానికి మేము అనేక చర్యలు తీసుకున్నాం. కానీ ఆ వారసత్వాన్ని విచ్ఛిన్నం చేయడం అంత సులువేమీ కాదు. ముంబై భౌగోళిక, సంస్కృతి, కాస్మోపాలిటన్‌ నేచర్‌ వల్ల కూడా దానికి తొలి ప్రాధాన్యం ఇవ్వొచ్చు. ఉత్తరాది రాష్ట్రాలు, హైదరాబాద్‌కు చెందిన టాప్ ర్యాంకర్లు ముంబైకి దగ్గరగా ఉన్నందున అందులో చేరడానికి ఇష్టపడవచ్చు. చెన్నై ఇప్పటికీ కన్జర్వేటివ్‌ సిటీగా పరిగణింపబడుతుంది. టాప్ 500 ర్యాంకర్లలో IIT-B, IIT-M సమాన సంఖ్యలో విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. మా విద్యార్థులలో 90%కిపైగా గత సంవత్సరం క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో జాబ్‌లు సాధించారు. ఈ సంవత్సరం మా ప్లేస్‌మెంట్ టీం మరిన్ని కంపెనీలకు చేరువైంది. అధిక సంఖ్యలో ఇంటర్న్‌షిప్‌లను కూడా పొందాం. 8 CGPAకి పై ఉన్న విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో మంచి అవకాశాలు అందుతాయన్నారు. అనంతరం క్యాంపస్‌లో ఆత్మహత్యల నివారణ గురించి మాట్లాడుతూ.. ఫ్రెషర్స్ కోసం వెల్ నెస్ సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఇది బలహీన విద్యార్థులను గుర్తించి సహాయం అందించడంలో సహాయపడుతుందని తెలిపారు. చదువులో ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులను వాలంటీర్లు గుర్తించి తదనుగుణంగా వారిలో మనోధైర్యం నింపేందుకు వీలుకల్పిస్తారని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.