IIT Recruitment: ఐఐటీ జమ్మూలో నాన్‌ టీచింగ్ ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షలకు పైగా జీతం.. ఎవరు అర్హులంటే..

| Edited By: Ravi Kiran

Oct 29, 2021 | 6:25 AM

IIT Recruitment 2021: జమ్మూలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థలో నాన్‌ టీచింగ్ పోస్టులను..

IIT Recruitment: ఐఐటీ జమ్మూలో నాన్‌ టీచింగ్ ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షలకు పైగా జీతం.. ఎవరు అర్హులంటే..
Iit Jammu Jobs
Follow us on

IIT Recruitment 2021: జమ్మూలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థలో నాన్‌ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 34 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో పోస్టులు ఉన్నాయి, ఎవరు అర్హులు లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న పోస్టులు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా సైంటిఫిక్‌ ఆఫీసర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంఈ/ ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 31 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష/ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ / కంప్యూటర్‌ టెస్ట్‌ / ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతరులు మాత్రం రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది.

* పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Personal Loans: పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు ఈ తప్పులు చేయకండి..

Samantha: తన సోషల్ మీడియా ఖాతాల నుంచి చైతూ ఫోటోలు డిలీట్ చేసిన సమంత

Ox Died: గ్రామాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టిన ఎద్దు మరణం.. రాత్రంతా జాగరం ఉంటూ..