IIT Hyderabad Jobs: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. నెలకు రూ.1,77,500ల జీతంతో ఐఐటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు..

|

Mar 16, 2023 | 8:58 PM

 హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ.. రెగ్యులర్‌ ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ సూపరింటెండెంట్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్, జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

IIT Hyderabad Jobs: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. నెలకు రూ.1,77,500ల జీతంతో ఐఐటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు..
IIT Hyderabad
Follow us on

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ.. రెగ్యులర్‌ ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ సూపరింటెండెంట్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్, జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్‌, బీపీఈడీ, ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్‌, ఎంసీఏ, ఎంఎస్సీ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు పోస్టును బట్టి 35, 40, 45 యేళ్లు ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 3, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్‌ అభ్యర్ధులు రూ.500లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఈడబ్ల్యూఎప్‌/మహిళా అభ్యర్ధులు ఫీజు చెల్లించనవసరం లేదు. ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.21,700ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.