IIT Recruitment: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ క్యాంపస్‌లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్ నగ శివారు, సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న ఈ ఇన్‌స్టిట్యూట్‌లో పలు పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా రిసెర్చ్ అసోసియేట్ (01), జూనియర్ రిసెర్చ్ ఫెలో (01) ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* రిసెర్చ్ అసోసియేట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ (సీఎస్‌ఈ) ఉత్తీర్ణతతో పాటు పైథాన్, సీ++ ప్రోగ్రామింగ్ స్కిల్స్ తెలిసి ఉండాలి.
* జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బీటెక్/ ఎంటెక్(ఏఐ లేదా ఎంఎల్) ఉత్తీర్ణతతో పాటు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్‌లో పని అనుభవం ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈమెయిల్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంఉటంది.
* రిసెర్చ్ అసోసియేట్ పోస్టుకు అప్లై చేసుకునే వారు తమ రెజ్యూమ్‌ను నేరుగా saketha@cse.iith.ac.in మెయిల్ ఐడీకి పంపించాలి.
* జూనియర్ రిసెర్చ్ ఫెలో అభ్యర్థులు దరఖాస్తులను vsharma@phy.iith.ac.in మెయిల్ ఐడీకి పంపించాలి.
* రిసెర్చ్ అసోసియేట్ పోస్టులకు 30-06-2022 చివరి తేదీ కాగా, జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులకు 01-07-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులకు ఇంటర్వ్యూలను 10-07-2022, 15-07-2022 తేదీల్లో నిర్వహిస్తారు.
* రిసెర్చ్ అసోసియేట్ పోస్టులకు ఇంటర్వ్యూలను 08-07-2021 తేదీన నిర్వహిస్తారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..