IGNOU ADMISSION 2021 : జూలై సెషన్ అడ్మిషన్, రీ-రిజిస్ట్రేషన్ కోసం గడువుతేదీని పొడగించిన ఇగ్నో..

|

Aug 02, 2021 | 3:41 PM

IGNOU ADMISSION 2021 : ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ జూలై సెషన్ కోసం తాజా అడ్మిషన్, రీ-రిజిస్ట్రేషన్ కోసం

IGNOU ADMISSION 2021 : జూలై సెషన్ అడ్మిషన్, రీ-రిజిస్ట్రేషన్ కోసం గడువుతేదీని పొడగించిన ఇగ్నో..
Ignou Admission 2021
Follow us on

IGNOU ADMISSION 2021 : ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ జూలై సెషన్ కోసం తాజా అడ్మిషన్, రీ-రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీని పొడిగించింది. ఇప్పుడు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు 16 ఆగస్టు వరకు నమోదు చేసుకోవచ్చు. కొత్త అభ్యర్థులు కొత్త రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. ఇంకా మొత్తం సమాచారాన్ని సమర్పించాలి. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించేటప్పుడు అభ్యర్థులు కొనసాగించాలనుకుంటున్న ప్రోగ్రామ్‌ని ఎంచుకోవాలి. సూచనలను జాగ్రత్తగా చదవాలని సూచించారు. విశ్వవిద్యాలయం వివిధ విభాగాలలో 200 కంటే ఎక్కువ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. వీటిలో మాస్టర్స్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ, పిజి డిప్లొమా, డిప్లొమా, పిజి సర్టిఫికెట్, సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లు, అవగాహన స్థాయి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ అన్ని కార్యక్రమాల గురించి సమాచారాన్ని ignouadmission.samarth.edu.in ని సందర్శించడం ద్వారా తనిఖీ చేయవచ్చు.

ఇగ్నో అడ్మిషన్ 2021 కోసం ఎలా దరఖాస్తు చేయాలి..
1. ఇందులో దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా ఇగ్నో అధికారిక వెబ్‌సైట్‌ ignou.ac.in కి వెళ్లండి.
2. వెబ్‌సైట్ హోమ్ పేజీలో ఇచ్చిన అడ్మిషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
3. ఇప్పుడు లాగిన్ అవ్వండి. అప్లికేషన్ ఫారమ్ నింపండి పూర్తి వివరాలను చదవండి.
4. ఫీజు చెల్లించి ఫారమ్‌ని సమర్పించండి.
5. భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ఫారం ప్రింట్ అవుట్ తీసుకోండి.

ఇటీవల ఇగ్నో ఉర్దూలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సును ప్రారంభించింది. ఇగ్నో స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ దూరవిద్య కింద ఈ కోర్సును ప్రారంభించింది. వివిధ దేశాలలో మాట్లాడే భాషలను అర్థం చేసుకోవడానికి ఈ కోర్సు సహాయపడుతుంది.ఈ కోర్సు అభ్యాసకులను విస్తృతమైన ఉర్దూ భాష, సాహిత్యానికి పరిచయం చేస్తుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ కోర్సు (ఇగ్నో ఉర్దూ కోర్సు) విద్యార్థులకు ఉర్దూ సాహిత్యం, అరబిక్ సాహిత్యం, పర్షియన్ సాహిత్యం, ఆంగ్ల సాహిత్యం, హిందీ సాహిత్యంపై మంచి అవగాహన పెంపొందించడానికి సహాయపడుతుంది. మీరు ఇగ్నో అధికారిక వెబ్‌సైట్‌లో కోర్సు వివరాలను ignouadmission.samarth.edu.in వద్ద తనిఖీ చేయవచ్చు.

యునెస్కో గుర్తించిన ఈ కోటలో ఆడదెయ్యెం ఉందట..! సందర్శకులు గొంతు కూడా విన్నారట..

Digital Currency: డిజిటల్ కరెన్సీ వైపు రిజర్వ్ బ్యాంక్ చూపు..డిజిటల్ కరెన్సీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!

Telegram: గ్రూప్‌ వీడియో కాల్‌లో మరో సంచలనం.. అద్భుత ఫీచర్‌ను పరిచయం చేసిన టెలిగ్రామ్‌. ఇదే కాదు ఇంతకు మించి కూడా..