IDRBT Recruitment: ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ రిసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఈ సంస్థ హైదరాబాద్‌లోని కార్యాలయంలో ఖాళీలను భర్తీ చేయనుంది. ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 05 రిసెర్చ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* అలాగే సైబర్ సెక్యూరిటీ/ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ/ ఎథికల్ హ్యాకింగ్ వంటి టెక్నికల్ విభాగాల్లో అనుభవం తప్పనిసరి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్/ ఈమెయిల్ దర్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు పూర్తి వివరాలను.. project@idrbt.ac.in మెయిల్ ఐడీకి పంపించాలి.
* ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే వారు.. ది హ్యూమన్ రీసోర్సెస్ డిపార్ట్‌మెంట్, ఐడీఆర్‌బీటీ, రోడ్ నెం1, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్ అడ్రస్‌కు పంపించాలి.
*ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.24,500 చెల్లిస్తారు.
* అభ్యర్థులను విద్యార్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని సంస్థ నిర్ణయించే తదుపరి పద్ధతుల ద్వారా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 07-02-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Viral Video: ఆపదలో పప్పి !! చూసిన మరో కుక్కపిల్ల ఏం చేసిందో తెలుసా ?? వీడియో
Jallikattu: జల్లికట్టుకు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ గీత దాటొద్దన్న తమిళనాడు సర్కార్..