ICSIL Jobs: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేడే చివరి తేదీ..

|

Mar 04, 2022 | 6:10 AM

ICSIL Jobs: భార‌త ప్రభుత్వానికి చెందిన ఇంట‌లిజెంట్ క‌మ్యూనికేష‌న్ సిస్టమ్స్ ఇండియా (Intelligent Communication Systems India Limited) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీలో ఉన్న ఈ సంస్థలో...

ICSIL Jobs: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేడే చివరి తేదీ..
Icsil Jobs
Follow us on

ICSIL Jobs: భార‌త ప్రభుత్వానికి చెందిన ఇంట‌లిజెంట్ క‌మ్యూనికేష‌న్ సిస్టమ్స్ ఇండియా (Intelligent Communication Systems India Limited) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీలో ఉన్న ఈ సంస్థలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్‌ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు మార్చి 4తో (నేటితో) ముగియనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్/డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు డిప్లొమా/క‌ంప్యూట‌ర్ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.

* అభ్యర్థుల వ‌య‌సు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మ‌ధ్య ఉంటుంది.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* అభ్యర్థులను తొలు వయసు, విద్యార్హతల ఆధారంగా షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు, అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణ నేటితో (04-03-20200) ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Allu Arjun: నయా పాన్ ఇండియా స్టార్.. సమ్మర్ నే టార్గెట్ చేస్తున్న అల్లు అర్జున్

BEL Jobs 2022: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో సీనియర్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలు.. నెలకు లక్షకు పైగా జీతంతో..

Luxury Dogs video: ఈ వీడియో చూశాక ఎవరినీ కుక్కతో పోల్చరు.. ఈ వీడియో చూస్తే ఒప్పుకోక తప్పదు.. వైరల్ వీడియో..