Luxury Dogs video: ఈ వీడియో చూశాక ఎవరినీ కుక్కతో పోల్చరు.. ఈ వీడియో చూస్తే ఒప్పుకోక తప్పదు.. వైరల్ వీడియో..
పెంపుడు జంతువులలో మొదటి ప్రాధాన్యత కుక్కలదే.. చాలామంది కుక్కలని ఇష్టపడతారు. అందుకు కారణం దానికి ఉండే విశ్వాసం. కుక్కలకి విశ్వాసం చాలా ఎక్కువ...సమయం వచ్చినప్పుడు యజమానిపై తమ విధేయతని నిరూపించుకుంటాయి. అందుకే పెంపుడు కుక్కలని...
పెంపుడు జంతువులలో మొదటి ప్రాధాన్యత కుక్కలదే.. చాలామంది కుక్కలని ఇష్టపడతారు. అందుకు కారణం దానికి ఉండే విశ్వాసం. కుక్కలకి విశ్వాసం చాలా ఎక్కువ…సమయం వచ్చినప్పుడు యజమానిపై తమ విధేయతని నిరూపించుకుంటాయి. అందుకే పెంపుడు కుక్కలని కొందరు తమ కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటారు. వాటికి చాలా ప్రాథాన్యత ఇస్తారు. ఇదిగో ఈవీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది. బ్రిటన్‌లో రెండు కుక్కల గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వీటి వైభవం మామూలుగా ఉండదు. విలాసవంతమైన జీవితం గడుపుతున్నాయి. ఈ రెండు కుక్కలు కేవలం బాటిల్ వాటర్ మాత్రమే తాగుతాయి. ఖరీదైన కబాబ్స్ తింటాయి. వీటి మెయింటెన్స్‌కి నెలకి ఎంత ఖర్చవుతుందో తెలిస్తే నోరెళ్లబెడుతారు.బ్రిటన్ చెందిన లియోన్ గెల్లర్, స్టీవ్ దంపతులు రెండు కుక్కలను పెంచుకుంటున్నారు. వారు ఆ కుక్కలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వాటికి ఖరీదైన బట్టలు వేస్తారు.. అదీ ఏ వెయ్యో, రెండు వేల ఖరీదువో కాదు… ఎంత ఖరీదంటే 5 లక్షల కంటే ఎక్కువ విలువైన బంగారు జాకెట్లు వాటికి వేస్తారు. ఓ టీవీ షో చూస్తున్నప్పుడు తన పెంపుడు కుక్కలకు ఖరీదైన దుస్తులు వేయాలనే ఆలోచన వచ్చిందట ఆ దంపతులకి. అప్పటినుంచి దంపతులిద్దరూ కలిసి షాపింగ్ చేస్తూ ఆ కుక్కల కోసం ఖరీదైన బట్టలు కొంటున్నారట. వాళ్లకి అదో ఆనందం.. ఇప్పుడు ఈ కుక్కల ఫోటోలునెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు వాటి అదృష్టాన్ని చూసి రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి… ఇకపై ఎవరినైనా కుక్కతో పోల్చుతారా…
మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…