Viral Video: హేళన చేశారని.. కొడుకు పెళ్లికి హెలికాఫ్టరే కొనేశాడు ఓ తండ్రి.. ఆశ్చర్యంలో గ్రామస్తులు.. వీడియో నెట్టింట వైరల్‌

Viral Video: హేళన చేశారని.. కొడుకు పెళ్లికి హెలికాఫ్టరే కొనేశాడు ఓ తండ్రి.. ఆశ్చర్యంలో గ్రామస్తులు.. వీడియో నెట్టింట వైరల్‌

Anil kumar poka

|

Updated on: Mar 03, 2022 | 7:41 PM

కొందరు సాటి మనుషులను హేళన చేయడం, వారిని విమర్శించడం చేస్తుంటారు. అయితే వాటి వల్ల కొందరు బాధపడినా.. కొందరు ఛాలెంజింగ్‌ గా తీసుకొని ఎంత దూరమైనా వెళ్తారు. అందుకు నిదర్శనమే ఈ వీడియో. రాజస్తాన్‌లోని కరౌలి జిల్లాలోని కామ్రీ గ్రామానికి చెందిన రాధేశ్యామ్ సైనీ ఒక రోజు తన బిడ్డతో


కొందరు సాటి మనుషులను హేళన చేయడం, వారిని విమర్శించడం చేస్తుంటారు. అయితే వాటి వల్ల కొందరు బాధపడినా.. కొందరు ఛాలెంజింగ్‌ గా తీసుకొని ఎంత దూరమైనా వెళ్తారు. అందుకు నిదర్శనమే ఈ వీడియో. రాజస్తాన్‌లోని కరౌలి జిల్లాలోని కామ్రీ గ్రామానికి చెందిన రాధేశ్యామ్ సైనీ ఒక రోజు తన బిడ్డతో కలిసి ఒక చిన్న హెలికాప్టర్‌​ బొమ్మతో ఆడుకుంటుండగా ఒక వ్యక్తి సరదాగా కొడుకు పెళ్లికి నిజమైన హెలికాప్టర్‌ని తీసుకురావాలి అంటూ హేళనగా అన్నాడు. అయితే రాధేశ్యామ్ ఆ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. ఎలాగైనా తన కొడుకు పెళ్లి నాటికి హెలికాఫ్టర్‌ని తన గ్రామంలో దింపాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే తన కొడుకు పెళ్లికి 6 లక్షల రూపాయలు వెచ్చించి నిజంగానే హెలికాప్టర్‌ను బుక్‌ చేశాడు. అయితే వధువు తండ్రి దినేష్‌ చాలా పేదవాడు. ఇక పెళ్లికూతురు తాను కలలో కూడా ఊహించని విధంగా అత్తారింటికి వెళ్లడం ఆమెకు పట్టరాని సంతోషం కలిగింది. ఆమె గ్రామస్తులు సైతం ఎంతగానో సంతోషించారు.. ఆ గ్రామం అంతా ఆనంద వాతావరణంతో నిండిపోయింది. వధూవరులిద్దరూ హెలికాప్టర్‌లో బయలుదేరారు.. రాథేశ్యామ్‌ తాను అనుకున్నట్టుగా కొడుకు పెళ్లికి తన గ్రామంలో హెలికాఫ్టర్‌ను దించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Rashmika Mandanna: కొంటె చూపులతో కవ్విస్తున్న ‘శ్రీవల్లి’.. గ్లామర్ డోస్‌లో ‘తగ్గేదేలే’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు..

Jacqueline Fernandez: అబ్భురపరిచే వయ్యారాలతో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ‘జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌’..ఫొటోస్