
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025-27 సంవత్సరానికి సంబంధించి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (CRP)-కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (CSA) XV ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 10,277 క్లర్క్ పోస్టులను భర్తీ చేయనుంది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆగస్టు 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా విభాగంలో డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. స్థానిక భాషలో చదవడం, రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. అభ్యర్దుల వయోపరిమితి ఆగస్టు 1, 2025వ తేదీ నాటికి తప్పనిసరిగా 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ వర్గానికి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు చొప్పున వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 21, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం, డీఈఎస్‌ఎం అభ్యర్థులు రూ.175, ఇతర అభ్యర్ధులు రూ.850 చొప్పున చెల్లించాలి. రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్), స్థానిక భాష పరీక్ష తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.24,050 నుంచి రూ.64,480 వరకు జీతంగా చెల్లిస్తారు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.