
హైదరాబాద్, సెప్టెంబర్ 2: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)… కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (CRP)-కస్టమర్ సర్వీస్ అసోసియేట్(CSA) 10,277 క్లర్క్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్ట్ 28వ తేదీతో ముగిసింది. అయితే దరఖాస్తు సమయంలో ఏవైనా వివరాలు పొరబాటున తప్పుగా నమోదు చేసిన అభ్యర్ధులకు ఐబీపీఎస్ మరో అవకాశం ఇచ్చింది. అభ్యర్ధులు తమ దరఖాస్తులోని వివరాలను సవరించుకోవడానికి అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 3 వరకు అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్‌లో మార్పులు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ తర్వాత త్వరలోనే ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేయనుంది. ఈ పరీక్ష దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో అక్టోబర్ 4, 5, 11 తేదీల్లో నిర్వహించనుంది. ఇక ఇందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్ రాత పరీక్ష నవంబర్ 29న నిర్వహిస్తారు.
ఐబీపీఎస్ క్లర్క్-2025 కరెక్షన్ విండో లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఎంబీఏ ఫస్ట్, సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన షెడ్యుల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు పరీక్షలకు సంబంధించిన షెడ్యుల్‌ను అధికారులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. తాజా షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 10 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి షెడ్యుల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 10 నుంచి 18 వరకు ఈ పరీక్షలు జనరగనున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.