IIT Hyderabad: హైదరాబాద్‌ ఐఐటీలో సరికొత్త కోర్సులు.. దరఖాస్తుకు రేపే చివరి తేదీ.. వెంటనే అప్లై చేసుకోండి…

|

Apr 13, 2021 | 4:53 PM

AI Course In IIT Hyderabad: మారుతోన్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలోనూ మార్పులు వస్తున్నాయి. కొంగొత్త కోర్సులతో మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సన్నద్దం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మక ఐఐటీ హైదరాబాద్...

IIT Hyderabad: హైదరాబాద్‌ ఐఐటీలో సరికొత్త కోర్సులు.. దరఖాస్తుకు రేపే చివరి తేదీ.. వెంటనే అప్లై చేసుకోండి...
Ai Course In Hyderabad
Follow us on

AI Course In IIT Hyderabad: మారుతోన్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలోనూ మార్పులు వస్తున్నాయి. కొంగొత్త కోర్సులతో మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సన్నద్దం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మక ఐఐటీ హైదరాబాద్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో (ఏఐ) కోర్సులను అందిస్తోంది. ఇప్పటికే బీఈ/బీటెక్‌లో ఏఐ కోర్సులను అందిస్తోన్న ఈ సంస్థ.. తాజాగా పీజీ స్థాయిలో ఎంటెక్‌లో కూడా ఈ కోర్సులను ప్రవేశపెట్టింది. ఈ కోర్సులకు ఐఐటీ ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసింది. బీఈ/బీటెక్‌ పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సును చేయొచ్చు. ఇక ప్రస్తుతం మార్కెట్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఏ స్థాయిలో ముఖ్య పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా ఏఐ ముఖ్య పాత్ర పోషిస్తోంది. అన్ని రకాల వస్తువులు స్మార్ట్‌గా మారుపోతుండడంతో ఏఐకి ప్రాధాన్యత పెరిగింది.
దీంతో ఈ కోర్సులు చేయడానికి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ ఐఐటీలో ఎంటెక్‌ కోర్సుకు అప్లై చేసుకోవడానికి ఇంకా ఒక్క రోజే మిగిలి ఉంది. అంటే ఏప్రిల్‌ 14లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో ఎంటెక్‌ చేయాలనుకునే వారికి రెండు రకాల ప్రోగ్రామ్స్‌ అందుబాటులో ఉన్నాయి.. అందులో ఒకటి రెండేళ్ల ప్రోగ్రామ్‌ కాగా, మరొకటి మూడేళ్ల ప్రోగ్రామ్‌..

రెండేళ్ల ప్రోగ్రామ్‌..

ఈ కోర్సు చేయాలనుకునే విద్యార్థులు.. బీఈ/బీటెక్​/ ఎంఎస్సీ లేదా దానికి సమానమైన డిగ్రీతో పాటు గేట్ స్కోరు కలిగి ఉండాలి. లేదా బీఈ/బీటెక్​/ ఎంఎస్సీ చేసిన ఐఐటీ విద్యార్థులు గేట్​ స్కోర్​ లేకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక, ఎంటెక్​ సెల్ఫ్​ స్పాన్సర్డ్​ కోర్సు కోసం బీఈ/బీటెక్/ ఎంఎస్సీ లేదా సమానమైన డిగ్రీ ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఈ కోర్సుకు గేట్ స్కోరు తప్పనిసరి కాదు. దీనికి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మూడేళ్ల ప్రోగ్రామ్‌..

బీఈ/బీటెక్​, ఎంఎస్సీ లేదా తత్సమాన డిగ్రీలో 8.0 అంతకంటే ఎక్కువ సీజీపీఏ స్కోరు ఉండాలి. లేదా ఉత్తీర్ణత సాధించిన డేట్‌ స్కోర్‌ కలిగి ఉండాలి. డిగ్రీ చివరి ఏడాదిలో ఉన్న వారు కూడా ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏ అంశాలను నేర్పిస్తారు..

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎంటెక్‌ కోర్సుల్లో భాగంగా విద్యార్థులకు.. డీప్​ లెర్నింగ్​, మెషిన్​ లెర్నింగ్​, అటానామస్​ వెహికిల్స్, కంప్యూటర్ విజన్​, జనరేటివ్​ మోడల్స్​, వీడియో క్వాలిటీ అసెస్​మెంట్​, స్పీచ్​ సిస్టమ్స్​, ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ ఫర్​ అగ్రికల్చర్​, బయేసియన్ లెర్నింగ్​, సోషల్ మీడియా, టెక్స్ట్ అనాలసిస్​, రోబోటిక్స్ రికమండేషన్​ సిస్టమ్​, డేటా మైనింగ్. మెషిన్​ లెర్నింగ్​ ఇన్​ ఆస్ట్రానమీ, ఇంటర్​ఫియరెన్స్​ అల్గోరిథం, గ్రాఫికల్ మోడల్స్, బిగ్​ డేటా అనాలసిస్​, కంప్యూటర్​ ఆర్కిటెక్చర్​ ఫర్​ ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్​ ఆఫ్​ థింగ్స్​, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు.

Also Read: CBSE Exams 2021: బోర్డు పరీక్షలు రద్దు చేయండి.. లేకపోతే కరోనా ప్రళయమే: సీఎం కేజ్రీవాల్

TIMS Recruitment 2021: తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక..

Common Examination: ఎడ్‌సెట్‌ పరీక్ష విధానంలో ప్రభుత్వం మార్పులు.. సబ్జెక్టుల వారీగా ర్యాంకుల విధానం రద్దు