ECIL: ఈసీఐఎల్‌లో టెక్నికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. మార్కుల ఆధారంగా షార్ట్‌ లిస్ట్‌, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.

|

Aug 20, 2021 | 6:35 PM

ECIL Recruitment 2021: హైదరాబాద్‌లోని అణుశక్తి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా...

ECIL: ఈసీఐఎల్‌లో టెక్నికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. మార్కుల ఆధారంగా షార్ట్‌ లిస్ట్‌, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.
Ecil Jobs
Follow us on

ECIL Recruitment 2021: హైదరాబాద్‌లోని అణుశక్తి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా టెక్నికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 25తో ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 08 టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు.
* పైన తెలిపిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం తప్పనిసరి.
* కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ సబ్జెక్టులో ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 31-07-2021 నాటికి 30 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను మొదట బీఈ/బీటెక్‌లో సాధించిన మార్కులు, అనుభవం ఆధారంగా షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు. అనంతరం షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 23,000 జీతంగా చెల్లిస్తారు.
* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 25-08-2021ని నిర్ణయించారు.
* నోటిఫికేషన్‌కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.. 
* దరఖాస్తు చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.. 

Also Read: Gorantla Butchaiah: బుచ్చయ్య చౌదరిని బుజ్జగించేందుకు త్రిసభ్య బృందం ప్రయత్నం.. ఆయన చెప్పిన మాటతో వెనుతిరిగిన నేతలు!

Rakul Preet Singh: రకుల్ ప్రీత్‌కు క్రేజీ ఆఫర్.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న ఢిల్లీ సుందరి..

మహిళలు కాళ్లకు వెండి పట్టీలు ధరించడం వెనక పెద్ద సైన్స్‌ ఉందని తెలుసా.? బంగారంతో చేసినవి ఎందుకు వాడొద్దంటే.