హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ముంబయిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, రిఫైనరీ డివిజన్ పలు విభాగాల్లో ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 116 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ – ఇంజనీరింగ్ (86), టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీ (30) ఖాళీలు ఉన్నాయి.
* గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీలో భాగంగా సివిల్/మెకానికల్/కెమికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ /ఇన్ స్ట్రుమెంటేషన్/కంప్యూటర్ సైన్స్ /ఐటీ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీలో సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఇన్ స్ట్రుమెంటేషన్ /కెమికల్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఇంజనీరింగ్/డిప్లొమాలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 25,000, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన వారికి రూ. 15,000 స్టైఫండ్‌గా అందిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు ఫిబ్రవరి 12, 2023ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..