HPCL Recruitment 2021: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బయోఫ్యూయల్స్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 255 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హతలు ఏంటి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? అన్ని పూర్తి వివరాలు మీకోసం..
* మొత్తం 255 ఖాళీలకు గాను జనరల్ మేనేజర్, మెకానికల్ ఇంజనీర్, సాయిల్ అనలిస్ట్, కేన్ క్లర్క్, ఈటీపీ ఆపరేటర్, ఎన్విరాన్‌మెంటల్ ఆఫీసర్, ఈడీపీ ఆఫీసర్, బాయిలర్ అటెండెంట్, ఫిట్టర్, రిగ్గర్, ఈటీపీ ఆపరేటర్, ల్యాబ్ కెమిస్ట్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఇందులో భాగంగా జనరల్ అండ్ అడ్మినిస్ట్రేషన్, షుగర్ ఇంజనీరింగ్, ఫైనాన్స్, ఈడీడీ, ఇథనాలు విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవారు పోస్టుల ఆధారంగా పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో లేదా సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
* అభ్యర్థుల వయసు 01-09-2021 నాటికి 18 నుంచి 57 ఏళ్ల మధ్య ఉండాలి.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆఫ్‌లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను హెచ్‌పీసీఎల్ బయోఫ్యూయల్స్ లిమిటెడ్, హౌజ్ నెం -9, శ్రీ సడాన్, పాట్నా 800013 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను మొదట అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత స్కిల్ టెస్ట్, అనంతరం పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 16-10-2021 చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Exams postponed: తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన.. రేపు, ఎల్లుండి జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా!