HLL Recruitment: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఫార్మసిస్ట్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక.. రేపే చివరి తేదీ..
HLL Recruitment: హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ (HLL Lifecare Limited) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సికింద్రాబాద్‌లోని ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థ ఫార్మసిస్ట్ పోస్టులను భర్తీ...
HLL Recruitment: హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ (HLL Lifecare Limited) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సికింద్రాబాద్‌లోని ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థ ఫార్మసిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలోను మంగళ, బుధ వారాల్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎలా హాజరు కావాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా ఫార్మసిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఫార్మసీ/డీఫార్మసీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అంతేకాకుండా అభ్యర్థులకు సంబంధిత విభాగంలో కనీసం 0-3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
* ఎంపికైన అభ్యర్థులు పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఫార్మసీల్లో పని చేయాల్సి ఉంటుంది.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.
* ఇంటర్వ్యూలను హెచ్ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్, 10-3-11-1 షెనాయ్ నర్సింగ్ హోమ్ పక్కన, ఈస్ట్ మారేడ్‌పల్లి, సికింద్రాబాద్ – 5000026 అడ్రస్‌లో నిర్వహిస్తారు.
* అభ్యర్థులు సంబంధిత దృవపత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావాలి.
* ఇంటర్వ్యూలను 05-04-2022, 06-04-2022న నిర్వహించనున్నారు.
* ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నిర్వహిస్తారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Bikshamaiah Goud: బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే.. కాషాశం కండువా కప్పి ఆహ్వానించిన తరుణ్‌చుగ్