HPCL Recruitment: హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.

|

Oct 09, 2021 | 5:23 PM

HPCL Recruitment 2021: హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముంబయి కేంద్రంగా ఉన్న ఈ సంస్థ బెంగళూరులోని హెచ్‌పీ గ్రీన్‌ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌లో...

HPCL Recruitment: హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ  ఆధారంగా ఎంపిక.
Follow us on

HPCL Recruitment 2021: హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముంబయి కేంద్రంగా ఉన్న ఈ సంస్థ బెంగళూరులోని హెచ్‌పీ గ్రీన్‌ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌లో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులను భర్తీ చేయనుంది. కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్న ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* కెమస్ట్రీ, మైక్రో బయాలజీ/ బయోసైన్సెస్‌/ బయోటెక్నాలజీ, కెమికల్‌ ఇంజనీరింగ్‌ సబ్జెక్టుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు్ల్లో బీఎస్సీ, ఎమ్మెస్సీ, డిప్లొమా, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

* అయితే టీచింగ్‌ ఫీల్డ్‌లో ఉన్న అనుభవాన్ని పరిగణలోకి తీసుకోరు.

* అభ్యర్థుల వయసు 11-10-2021 నాటికి 28 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను మొదట అకడమిక్‌ మార్కులు, పని అనుభవం ఆధారంగా షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ/ రాత పరీక్ష ద్వారా తుది ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 40,000 నుంచి రూ. 50,000 వరకు స్టైఫండ్‌ రూపంలో చెల్లిస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Janasena-BJP: బీజేపీతో జనసేన కలిసే ఉంది.. బద్వేలు ఉప పోరు పోటీపై క్లారిటీ ఇచ్చిన నాదెండ్ల మనోహర్

WhatsApp: మరో అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొస్తున్న వాట్సాప్‌.. ఇకపై మీ డీపీ, మీకు ఇష్టమున్న వారికే కనిపిస్తుంది.

Hyderabad Rains: దట్టంగా కమ్మిన మబ్బులు.. గర్జిస్తోన్న మేఘాలు.. హైరదాబాద్‌లో మరికొద్దిసేపట్లో భారీ వర్షం