HAL Jobs 2025: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎలా ఎంపిక చేస్తారంటే?

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL).. పలు బ్రాంచ్‌లలో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఆపరేటర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 156 అపరేటర్‌ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్నారు. ఫిట్టింగ్‌, ఎలక్ట్రానిక్స్‌, గ్రైండింగ్‌ ఇనుస్ట్రుమెంట్‌ మెకానిక్‌..

HAL Jobs 2025: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎలా ఎంపిక చేస్తారంటే?
Hindustan Aeronautics Limited Recruitment

Updated on: Dec 20, 2025 | 6:32 AM

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL).. పలు బ్రాంచ్‌లలో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఆపరేటర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 156 అపరేటర్‌ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్నారు. ఫిట్టింగ్‌, ఎలక్ట్రానిక్స్‌, గ్రైండింగ్‌ ఇనుస్ట్రుమెంట్‌ మెకానిక్‌/ఇనుస్ట్రుమెంటేషన్‌, మెషినింగ్‌, టర్నింగ్‌.. విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 25, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు..

సంబంధిత పోస్టులను అనుసరించి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ (మూడేళ్ల NAC లేదా రెండేళ్ల ITI + NAC/NCTVT)లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2025 నవంబర్‌ 25వ తేదీ నాటికి జనరల్, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 28 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 33 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 31 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 25, 2025వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.22,000 చొప్పున జీతం చెల్లిస్తారు. రాత పరీక్ష అడ్మిట్‌ కార్డులను డిసెంబర్‌ 31 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

రాత పరీక్ష విధానం..

రాత పరీక్ష మొత్తం 3 విభాగాల్లో ఉంటుంది. పార్ట్‌ 1 జనరల్ అవేర్‌నెస్ 20 ప్రశ్నలకు, పార్ట్‌ 2లో ఇంగ్లిష్‌, రీజనింగ్‌ నుంచి 40 ప్రశ్నలకు, పార్ట్‌ 3లో సంబంధిత ట్రేడ్‌లో 100 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవల్సి ఉంటుంది. పరీక్ష రెండున్నర గంటల వ్యవధిలో జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.