TG CETs 2026 Convenors: తెలంగాణ సెట్స్‌ కన్వీనర్లు ఖరారు.. ఏ ఎంట్రన్స్ బాధ్యత ఏ వర్సిటీకంటే?

రాష్ట్ర వ్యాప్తంగా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన పరీక్ష తేదీలను త్వరలోనే ఉన్నత విద్యా మండలి ప్రకటించనుంది. ఈ క్రమంలో ఆయా సెట్లకు కన్వీనర్లను విద్యా మండలి నియమించింది. ఏ సెట్ పరీక్షకు ఏ కన్వీనర్ బాధ్యతలు చేపడుతున్నారో ఇక్కడ తెలుసుకోండి..

TG CETs 2026 Convenors: తెలంగాణ సెట్స్‌ కన్వీనర్లు ఖరారు.. ఏ ఎంట్రన్స్ బాధ్యత ఏ వర్సిటీకంటే?
Telangana CETs 2026 convenors

Edited By:

Updated on: Dec 30, 2025 | 12:38 PM

హైదరాబాద్, డిసెంబర్ 30: తెలంగాణలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్టుల కన్వీనర్లను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. సోమవారం జరిగిన కీలక సమావేశంలో చర్చించిన అనంతరం వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రొఫెసర్లను కన్వీనర్లుగా నియమిస్తూ మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏ ప్రవేశ పరీక్షకు.. ఏ యూనివర్సిటీ?

ఈసారి కూడా ప్రధాన ప్రవేశ పరీక్షల బాధ్యతలను రాష్ట్రంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు అప్పగించారు

  • TG EAPCET 2026 (ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ): ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతను జేఎన్టీయూ-హైదరాబాద్ (JNTUH)కు అప్పగించారు. కన్వీనర్‌గా ప్రొఫెసర్ కె. విజయ కుమార్ రెడ్డి వ్యవహరిస్తారు.
  • TG ICET 2026 (MBA, MCA): మహాత్మా గాంధీ యూనివర్సిటీ (నల్గొండ) ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరగనుంది. కన్వీనర్‌గా ప్రొఫెసర్ ఆలూవల రవి నియమితులయ్యారు.
  • TG EDCET 2026 (B.Ed): కాకతీయ యూనివర్సిటీ (వరంగల్) ఈ పరీక్షను నిర్వహిస్తుంది. కన్వీనర్‌గా ప్రొఫెసర్ బి. వెంకట్రామ్ రెడ్డి బాధ్యతలు చేపడతారు.
  • TG ECET, LAWCET & PGLCET 2026: ఈ మూడు పరీక్షల బాధ్యతలను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించారు.
  • TG ECET 2026 కన్వీనర్‌గా: ప్రొఫెసర్ పి. చంద్రశేఖర్.
  • TG LAWCET & PGLCET 2026 కన్వీనర్‌గా: ప్రొఫెసర్ బి. విజయలక్ష్మి వ్యవహరిస్తారు.
  • TG PGECET 2026 (M.E/M.Tech/M.Pharm): జేఎన్టీయూ-హైదరాబాద్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ పరీక్షకు ప్రొఫెసర్ కె. వెంకటేశ్వర రావు కన్వీనర్‌గా ఉంటారు.
  • TG PECET 2026 (Physical Education): శాతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్షకు ప్రొఫెసర్ రాజేష్ కుమార్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

పై అన్ని ప్రవేశ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్షలుగా నిర్వహించనున్నారు. కన్వీనర్ల నియామకం పూర్తయిన నేపథ్యంలో ఆయా పరీక్షల పూర్తి స్థాయి నోటిఫికేషన్లు, పరీక్షల తేదీలతో కూడిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి త్వరలోనే ప్రకటించనుంది. వృత్తి విద్యా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం విద్యామండలి అధికారిక వెబ్‌సైట్ www.tgche.ac.in లో చూడాలని సూచనలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.