HAL Recruitment: హైదరాబాద్‌ హాల్‌ సెకండరీ స్కూల్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

|

Mar 10, 2022 | 9:33 PM

HAL Recruitment: హైదరాబాద్‌లోని హిందుస్థాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకి చెందిన ఈ సంస్థకు చెందిన సెకండరీ స్కూల్‌ టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు...

HAL Recruitment: హైదరాబాద్‌ హాల్‌ సెకండరీ స్కూల్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
Hal Recruitment
Follow us on

HAL Recruitment: హైదరాబాద్‌లోని హిందుస్థాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకి చెందిన ఈ సంస్థకు చెందిన సెకండరీ స్కూల్‌ టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 13 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రైమరీ టీచర్లు (పీఆర్‌టీ) 04, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్‌ టీచర్లు (టీజీటీ – సైన్స్‌) 01, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు (టీజీటీ – సోషల్‌ సైన్స్‌) 01, డ్యాన్స్‌ టీచర్‌ 01, మ్యూజిక్‌ టీచర్‌ 01, కౌన్సెలర్‌ 01, అడ్మినిస్ట్రేటివ్‌ సపోర్ట్‌ క్లర్క్‌ 01, నర్సరీ టీచర్‌ 01, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (పీఆర్‌టీ-ఫిమేల్‌) 01, ఐటీ టెక్నికల్‌ అసిస్టెంట్‌ 01 ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/ డిగ్రీ, గ్రాడ్యుయేషన్‌; బీసీఏ, బీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సెంట్రల్‌/ స్టేట్‌ లెవల్‌ టీచర్స్‌ ఎలిజిబిటిలీ టెస్ట్‌ అర్హత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.

* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను ది ప్రిన్సిపల్‌, హాల్‌ సెకండరీ స్యూల్‌, హాల్‌ టౌన్‌షిప్‌, బాలానగర్‌, హైదరాబాద్‌ 500042 అడ్రస్‌కు పంపించండి.

* అభ్యర్థులను రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 22-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: High Cholesterol Effects: మీ శరీరంలో అధిక కొవ్వు ఉందా?.. రాత్రి సమయంలో ఈ సమస్యలు రావొచ్చు..!

Indraja: యూత్‌, పెద్ద‌లు మెచ్చేలా త‌ల్లి, కొడుకు రిలేష‌న్‌ను `స్టాండప్ రాహుల్`లో చూడొచ్చు.. ఇంద్రజ కామెంట్స్ వైరల్..

UP Election Results 2022: మనతో మామూలుగా ఉండదు మరి.. నెట్టింట్లో రచ్చ చేస్తున్న ‘యోగి’ ఫోటో..