GIC Recruitment 2021: డిగ్రీ చదివిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాల కోసం నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. తాజాగా 44 సేల్స్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జీఐసీఐ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అసిస్టెంట్ మేనేజర్ స్థాయిలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://www.gicofindia.com/ వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.. చివరి తేదీ.. మార్చి 29 చివరి తేదీ..
అర్హత :
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులు కనీసం 60శాతం మార్కులతో డిగ్రీ పాసై ఉండాలి.
వయసు:
21 ఏళ్ల నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ. 32,975 వేతనంగా చెల్లిస్తారు.
రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది., మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలను నిర్వహిస్తారని సమాచారం. ఈ ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాలను, సందేహాలను వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు
గమనిక : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావడంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కనుక దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందునుంచి రాత పరీక్షకు ప్రిపేర్ అయ్యితే మంచి ఫలితాలు పొందవచ్చు.
Also Read: Social Media: సోషల్ మీడియాకు అధిక టైమ్ కేటాయించే టాప్ 5 దేశాలివే.. భారత్ స్థానం ఎంతటే..!