FSSAI 2022: నెలకు రూ.218200ల జీతంతో ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్స్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. అర్హతలివే..

|

Oct 09, 2022 | 4:27 PM

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్స్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా.. డిప్యుటేషన్‌/రెగ్యులర్‌ ప్రాతిపదికన అడ్వైజర్, జాయింట్ డైరెక్టర్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ డైరెక్టర్, మేనేజర్, అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ మేనేజర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తదితర పోస్టుల..

FSSAI 2022: నెలకు రూ.218200ల జీతంతో ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్స్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. అర్హతలివే..
FSSAI New Delhi Recruitment 2022
Follow us on

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్స్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా.. డిప్యుటేషన్‌/రెగ్యులర్‌ ప్రాతిపదికన 79 అడ్వైజర్, జాయింట్ డైరెక్టర్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ డైరెక్టర్, మేనేజర్, అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ మేనేజర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ సెక్రటరీ, అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, పదో తరగతి, కెమిస్ట్రీ/బయోకెమిస్ట్రీ/ఫుడ్‌ టెక్నాలజీ/ఫుడ్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ/ఫుడ్‌ అండ్‌ న్యూట్రీషన్‌/ఎడిబుల్ ఆయిల్‌ టెక్నాలజీ/మైక్రోబయాలజీ/డైరీ టెక్నాలజీ/అగ్రికల్చరల్ లేదా హార్టికల్చరల్ సైన్సెస్‌/ఇండస్ట్రియల్‌ మైక్రోబయాలజీ/టాక్సికాలజీ/పబ్లిక్‌ హెల్త్‌/లైఫ్‌ సైన్స్‌/బయోటెక్నాలజీ/ఫ్రూట్‌ అండ్‌ వెజిటబుల్‌ టెక్నాలజీ/ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ క్వాలిటీ అష్యూరెన్స్‌ లేదా తత్సమాన స్పెషలైజేషన్‌లో పీజీ, యూజీ, బీఈ/బీటెక్‌, ఎంబీఏ, డిప్లొమా, ఎంటెక్‌/ఎంఈ, ఎంసీఏ, పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 58 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలతోపాటు ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 5, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 10వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అనంతరం అప్లికేషన్లను డౌన్‌లోడ్‌ చేసుకుని కింది అడ్రస్‌కు నవంబర్‌ 20వ తేదీలోపు పోప్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.950లు, ఓబీసీ అభ్యర్ధులు రూ.850లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.750లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి పోస్టును బట్టి నెలకు రూ.19,900ల నుంచి రూ.2,18,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

ఇవి కూడా చదవండి
  • అడ్వైజర్ పోస్టులు: 1
  • జాయింట్ డైరెక్టర్ పోస్టులు: 6
  • సీనియర్ మేనేజర్ పోస్టులు: 1
  • సీనియర్ మేనేజర్ (IT) పోస్టులు: 1
  • డిప్యూటీ డైరెక్టర్ పోస్టులు: 7
  • మేనేజర్ పోస్టులు: 2
  • అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు: 2
  • అసిస్టెంట్ డైరెక్టర్ (టెక్నికల్) పోస్టులు: 6
  • డిప్యూటీ మేనేజర్ పోస్టులు: 3
  • అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు: 7
  • సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ పోస్టులు: 4
  • పర్సనల్ సెక్రటరీ పోస్టులు: 15
  • అసిస్టెంట్ మేనేజర్ (IT) పోస్టులు: 1
  • అసిస్టెంట్ పోస్టులు: 7
  • జూనియర్ అసిస్టెంట్ (గ్రేడ్-I) పోస్టులు: 1
  • జూనియర్ అసిస్టెంట్ (గ్రేడ్-II) పోస్టులు: 12
  • స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) పోస్టులు: 3

అడ్రస్‌: The Assistant Director (Recruitment), FSSAI Headquarters, 3rd Floor, FDA Bhawan, Kotla Road New Delhi.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.